‘హరిహర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్డేట్.. టీజర్ ఆన్ ది వే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒకెత్తయితే.. ‘హరిహర వీరమల్లు’ మరో ఎత్తు. పవన్ కెరీర్ లోనే తొలిసారి చేస్తున్న హిస్టారికల్ డ్రామా ఇది. మొఘలుల కాలం నాటి కథతో విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు పవన్.

చాణక్యుడికి ఉన్న తెలివితేటలు.. తెనాలి రామలింగడుకి ఉన్న హాస్యచతురత.. ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ పాత్రలో కనిపించనున్నాయట. అలా.. ఎంతో వైవిధ్యంగా పవన్ పాత్రను తీర్చిదిద్దాడట డైరెక్టర్ క్రిష్. ఈ చిత్రంకోసం 17వ శతాబ్దం నాటి చార్మినార్ సెట్ ను ఒరిజినల్ కొలతలలోనే వేశారు. అలాగే.. ఆగ్రా కోటకు సంబంధించిన సెట్స్ ను కూడా నిర్మించారు. ఈ మూవీలో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ కనిపించబోతుంది. బాబీ డియోల్, నోరా ఫతేహి వంటి వారు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చిరంజీవి, చరణ్, బన్నీ వంటి వారికి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన కీరవాణి ఫస్ట్ టైమ్ పవన్ తో పనిచేస్తున్న సినిమా ఇది. గతంలో పవర్ స్టార్ కి ‘ఖుషి’ వంటి హిట్ ఇచ్చిన ఎ.ఎమ్.రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడంతో ‘హరిహర వీరమల్లు’కి బ్రేక్ పడింది.

షూటింగ్ కి బ్రేక్ పడినా.. ‘హరిహర వీరమల్లు’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా పూర్తవుతున్నాయట. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఉండే ఈ మూవీలోని వి.ఎఫ్.ఎక్స్ ను హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతో పాటు ఇరాన్, కెనడా వంటి ప్రదేశాల్లోనూ పూర్తిచేస్తున్నారట. త్వరలోనే ‘హరహర వీరమల్లు’ నుంచి స్పెషల్ ప్రోమో రానున్నట్టు ప్రకటించింది టీమ్.

Related Posts