మళ్లీ యాక్షన్ మోడ్ లో ‘దేవర’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. ఇప్పటికే చాలా భాగం కంప్లీట్ అయిన ‘దేవర’ షూటింగ్ కి ఆమధ్య విరామం వచ్చింది. ప్రధాన ప్రతినాయకుడు సైఫ్ ఆలీ ఖాన్ గాయపడడంతో.. షూట్ కి బ్రేక్ ఇచ్చింది టీమ్. అలాగే.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అనుకున్న సమయానికి పాటలు ఇవ్వడం లేదనే టాక్ ఉంది. ఈకోవలోనే ఏప్రిల్ లో రావాల్సిన ‘దేవర’ పార్ట్ 1 వాయిదా పడిందనేది ఇండస్ట్రీ టాక్.

అయితే.. ‘దేవర’ మళ్లీ యాక్షన్ మోడ్ లోకి మారుతున్నాడట. ఫిబ్రవరి 16 నుంచి ‘దేవర’ కొత్త షెడ్యూల్ ని షురూ చేయడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారట. ఇక.. ఈ మూవీలో తారక్ కి జోడీగా జాన్వీ కపూర్ తో పాటు మరాఠీ భామ శృతి మరాఠేని కూడా తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. మొత్తంమీద.. ‘దేవర 1’ రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Related Posts