బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్స్ కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు

భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ టైమ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఎంట్రీతోనే వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం అంటూ ముగ్గురు టాప్ హీరోలతో సినిమా చేసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. రీసెంట్ గా కూడా పుష్ప ది రైజ్, సర్కారువారి పాట చిత్రాలతో మరో రెండు సూపర్ హిట్స్ ను అందుకున్నారు. ప్రస్తుతం వీళ్లు నిర్మించిన వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్నాయి.

ఇప్పటికే ఈ రెండు సినిమాల రిలీజ్ ల కోసం థియేటర్స్ విషయంలో నానా తంటాలు పడుతున్న వీరికి లేటెస్ట్ గా తెలంగాణ జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. శ్రీమంతుడు సినిమా నుంచి కూడా వీరు సరిగ్గా జీఎస్టీలు చెల్లించడం లేదు అన్న కంప్లైంట్స్ తోనే మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ పై వరుసగా దాడులు మొదలుపెట్టారు. వీరితో పాటు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ కూడా ఉండటం విశేషం.


మైత్రీ మూవీస్ సంస్థను నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి కలిసి 2015లో సంయుక్తంగా స్థాపించారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే 2019లో వీరి టీమ్ నుంచి మోహన్ చెరుకూరి తప్పుకున్నాడు. తర్వాత నవీన్, రవిశంకర్ ఇద్దరూ ప్రొడక్షన్ హౌస్ ను రన్ చేస్తున్నారు. చిన్న సినిమాలతో ఫ్లాపులు, పెద్ద సినిమాలతో విజయాలు సాధించడం ఈ సంస్థలో కనిపించే విశేషం.

సంక్రాంతి సినిమాల తర్వాత కూడా ఈ బ్యానర్ నుంచి ఖుషీ, అమిగోస్, పుష్ప2, ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా. రామ్ చరణ్ 16వ సినిమాలను నిర్మించబోతోంది. ఇవన్నీ భారీ చిత్రాలే. మరి సడెన్ గా జీఎస్టీ, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్స్ మైత్రీ మూవీస్ ఆఫీస్ లో రైడ్స్ చేయడం సాధారణమేనా లేక ఇంకేదైనా బలమైన సమాచారం వారి వద్దా ఉందా అనేది తెలియాలి.

Telugu 70mm

Recent Posts

సుకుమార్ వారసురాలు వచ్చేసింది

వారసత్వం అనేది చిత్ర పరిశ్రమలో చాలా కామన్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరూ వారసత్వంగా వచ్చినవారే.…

2 hours ago

‘కృష్ణమ్మ’ ట్రైలర్.. సత్యదేవ్ రివెంజ్ డ్రామా

కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తోన్న సత్యదేవ్.. తాజాగా 'కృష్ణమ్మ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.…

2 hours ago

అనిల్ రావిపూడికి కౌంటర్ ఇచ్చిన రాజమౌళి

ప్రస్తుతం తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది రాజమౌళి అయితే.. మరొకరు అనిల్ రావిపూడి. తొలి సినిమా మొదలుకొని..…

2 hours ago

Prabhas has half a dozen films at present

Prabhas, who became the first Pan India star from Tollywood, is not at the usual…

15 hours ago

వెండితెర సంచలనం ‘అల్లూరి సీతారామరాజు’

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిగా చెప్పుకునే చిత్రాల్లో 'అల్లూరి సీతారామరాజు' మొదటి వరుసలో నిలుస్తుంది. కృష్ణ నటించిన…

16 hours ago

‘పుష్ప 2’ సాంగ్.. ఈసారి అస్సలు తగ్గేదే లే!

'పుష్ప' ఫ్రాంఛైజ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగ్ అయితే.. ఆ తర్వాత ప్రధానంగా…

16 hours ago