వెంకటేష్‌ అర్జునుడా..? సైంధవుడా..? అసలా టైటిలేంటి గురూ..?

విక్టరీ వెంకటేష్‌ అంటే ఫ్యామిలీ హీరో అనే ఫస్ట్ గుర్తొస్తుంది. ఆయన కెరీర్ లో మాస్ మూవీస్ చాలానే చేసినా.. ప్రధానంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తోనే ప్రత్యేకమైన స్టార్డమ్ తెచ్చుకున్నాడు వెంకీ. ఒకప్పుడు విక్టరీకి మారుపేరుగా ఉన్నాడు. అయితే మధ్యలో చాలా ఫ్లాపులు చూసి.. ఇక క్యారెక్టర్స్ కు వెళ్లడమే కరెక్ట్ అన్న విమర్శలూ ఫేస్ చేశాడు. బట్ కొన్నాళ్లుగా కాన్ స్టంట్ గా విజయాలు సాధిస్తున్నాడు వెంకటేష్‌. ఏకంగా వరుసగా తొమ్మిది విజయాలు సాధించాడు. ఈ విజయాలు మరో స్టార్ కు వస్తే ఎంత ప్రచారం చేసుకునేవారో చెప్పలేం. బట్ వెంకీ మాత్రం కామ్ గా పని చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.

దృశ్యంతో మొదలైన విజయ పరంపర దృశ్యం2 వరకూ తొమ్మిది హిట్స్ కొట్టి ఉన్నాడు వెంకీ. వీటిలో గురు తప్ప మిగతా వన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కే ఎక్కువగా నచ్చిన సినిమాలు. అలాంటి వెంకటేష్ తన 75వ సినిమాకు కొత్త బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకూ చేయని కంటెంట్ తో వస్తున్నట్టుగా లేటెస్ట్ గా వచ్చిన గ్లింప్ చూస్తే అర్థం అవుతుంది. హిట్, హిట్2 చిత్రాలతో రెండు హిట్స్ ఇచ్చిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. రీసెంట్ గానే అనౌన్స్ అయిన ఈ మూవీ టైటిల్ తో పాటు గ్లింప్ ను లేటెస్ట్ గా విడుదల చేశారు.


వెంకటేష్‌ మూవీ టైటిల్ గా “సైంధవ్” అని పెట్టారు. ఈ పాత్ర మహాభారతంలో ఉంటుంది. దుర్యోధనుడి చెల్లి దుస్సలను పెళ్లి చేసుకునేది ఈ సైంధవుడే. అతని క్యారెక్టర్ పూర్తిగా చెడ్డదిగానే ఉంటుంది భారతంలో. అతను పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది వద్దకు వెళ్లి చెడుగా ప్రవర్తించి భీముడి చేత చావు దెబ్బలు తింటారు. తర్వాత శివుడిని పూజించి ఓ వరం పొందుతాడు. ఆ వరం వల్లే పద్మవ్యూహంలో అర్జునుడి కొడుకు అభిమన్యుడు చనిపోతాడు. తర్వాత రోజు అర్జునుడు ఈ సైంధవుడిని చంపేస్తాడు. ఎలా చూసినా పురాణాల ప్రకారం సైంధవుడు దుర్మార్గుడు.

అతని పేరును వెంకటేష్‌ సినిమాకు టైటిల్ గా పెట్టడం ఆశ్చర్యమే. అయితే చాలామంది ఇది విలన్ పేరు. ఆ సైంధవ్అనే విలన్ వెంకటేష్‌ కొడుకును చంపితే తిరిగి అర్జునుడులా వెంకటేష్ పగ తీర్చుకుంటాడు. అందుకోసం సాగే వేట నేపథ్యంలోనే సినిమా ఉంటుందీ అంటున్నారు. బట్.. మహా భారతం అంటే మన దేశంలో కోట్లమందికి తెలుసు. అలాంటిది ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. మరి అన్ని చోట్లా ఈ సైంధవ్ పై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది కదా..? ఆ విషయం తెలిసే ఈ టైటిల్ పెట్టారా లేక పురాణం తెలియకుండా ఏదో సౌండ్ బావుంది కదా అని పెట్టారా అనేది వారికే తెలియాలి.

Telugu 70mm

Recent Posts

మహేష్-రాజమౌళి మూవీ కాస్టింగ్ డైరెక్టర్ పై క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా 'ఎస్.ఎస్.ఎమ్.బి.29'. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న…

17 mins ago

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

1 hour ago

Mirnalini Ravi

1 hour ago

Ketika Sharma

2 hours ago

Janhvi Kapoor

2 hours ago

NehaSolanki

2 hours ago