రాజమౌళి మౌనం పుష్ప కోసమేనా..?

ఆర్ఆర్ఆర్.. దేశమంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న సినిమా. ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవ్ గణ్, అలియాభట్, ఒలివియా మోరిస్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ప్రమోషనల్ టీజర్స్ తో పాటు రీసెంట్ గా విడుదలైన నాటు నాటు, జనని పాటలు ప్రేక్షకుల్లో అంచనాలను త్రిబుల్ చేశాయి. అందుకే ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్సెస్. ఆర్ఆర్ఆర్ వాల్డ్ ఆడియన్సెస్ ను ఆకట్టుకునే సినిమా. అందుకే ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండాలి. ఇటు ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాబట్టి దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రమోషన్స్ చేయాలి. అందుకే ఈ నెల 3న ట్రైలర్ విడుదల చేస్తున్నాం అని ప్రకటించింది టీమ్. బట్.. నవంబర్ 30న గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో ట్రైలర్ విడుదలను వాయిదా వేశారు. అయితే వీళ్లు ట్రైలర్ డేట్ ప్రకటించిన టైమ్ లోనే అల్లు అర్జున్ – సుకుమార్ ల పుష్ప చిత్ర ట్రైలర్ కూడా 6న విడుదల చేస్తున్నాం అని ప్రటకించారు. ఓ రకంగా పుష్పపైనా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. దీంతో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ముందు వచ్చి తర్వాత పుష్ప ట్రైలర్ వస్తే.. కేవలం మూడు రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప గురించి ఎక్కువ చర్చించుకుంటారు. ఈ విషయం అంచనా వేయలేకపోయింది రాజమౌళి టీమ్. అయినా ఆ తప్పును దిద్దుకునేందుకు సీతారామశాస్త్రి మరణం రూపంలో ఓ అవకాశం వచ్చింది.
ఇటు పుష్ప మూవీ ట్రైలర్ ను చెప్పినట్టుగానే 6నే విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాతే ఆర్ఆర్ఆర్ విడుదల చేయాలని రాజమౌళి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు అంటున్నారు. లేదంటే ఇప్పటికే కొత్త రిలీజ్ డేట్ చెప్పి ఉండేవారు. పుష్ప ట్రైలర్ వచ్చిన తర్వాత లేదా ఒక రోజు ముందైనా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారంటున్నారు. ఏదేమైనా రాజమౌళి ప్రమోషన్స్ కు సంబంధించి ఓ ఆలోచన చేస్తే దానికి తిరుగుండదు అంటారు. అది ఆర్ఆర్ఆర్ కూ అమలు చేస్తున్నాడు కదా..?

Related Posts