HomeMoviesటాలీవుడ్'దేవర'.. 'ఫియర్ సాంగ్' ప్రోమో వచ్చేసింది

‘దేవర’.. ‘ఫియర్ సాంగ్’ ప్రోమో వచ్చేసింది

-

‘జనతాగ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఆద్యంతం సముద్రం నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో ‘దేవర’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇంకా.. ఆ అంచనాలను మరెన్నో రెట్లు పెంచేయడానికి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. మే 19న విడుదల కాబోతున్న ‘దేవర 1’ ఫస్ట్ సింగిల్ ‘ఫియర్’కి సంబంధించి స్మాల్ ప్రోమో రిలీజయ్యింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘ఫియర్’ సాంగ్ కి సంబంధించి ప్రోమోను ట్విట్టర్ లో పంచుకున్నాడు. 14 సెకన్ల నిడివితో విజువల్ ట్రీట్ అందిస్తోన్న ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ‘దేవర’గా ఎన్టీఆర్ విజువల్స్ మేనియాతో పాటు.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ తో ఈ లిరికల్ సాంగ్ తీర్చిదిద్దినట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది.

ఇవీ చదవండి

English News