మరింత దూకుడు పెంచుతోన్న దిల్‌రాజు

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో దిల్‌రాజు ఖచ్చితంగా ఉంటుంది. గడిచిన 20 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు దిల్‌రాజు.

గతంలో గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలతో పోటీపడి సినిమాలను నిర్మించిన దిల్‌రాజు.. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి సంస్థల దూకుడును తట్టుకుంటూ.. మరింత దూకుడు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం దిల్‌రాజు కిట్టీలో ఏకంగా డజనుకు పైగా ప్రాజెక్టులున్నాయి. ఈనెలలోనే దిల్‌రాజు ప్రొడక్షన్స్ నుంచి ‘లవ్ మీ’ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఆ తర్వాత మెగా ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’ లైన్లో ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక.. నితిన్ తో తమ సంస్థలో చేస్తున్న ‘తమ్ముడు’ శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకుంటోంది.

ఇటీవలే విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమాని అనౌన్స్ చేశారు దిల్‌రాజు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే పట్టాలెక్కుతోంది.

అలాగే.. తన ఆస్థాన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటుంది.

ఇంకా.. నాని హీరోగా ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ అనే ప్రాజెక్ట్ పైప్‌లైన్లో ఉంది. బాలకృష్ణ, రవితేజ వంటి సీనియర్ హీరోలతోనూ సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి.

ధనుష్ హీరోగా ‘శ్రీకారం’ ఫేమ్ కిషోర్ రెడ్డితోనూ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దిల్‌రాజు. మరోవైపు.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో షాహిద్ కపూర్ తో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి సైతం దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంకా.. దిల్‌రాజునే నమ్ముకుని పరశురామ్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శైలేష్ కొలను వంటి దర్శకులు ఉన్నారు. వారంతా తమ తమ స్టోరీలు రెడీ చేసుకుంటున్నారు.

మొత్తంమీద.. ఈమధ్య కాస్త దూకుడు తగ్గించారనే పేరొచ్చినా.. దిల్‌రాజు ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తే మాత్రం అదంతా ఒట్టిదే అనిపిస్తోంది.

Related Posts