దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైందా?

చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు మధ్య విడదీయరాని బంధం ఉంది. భారతదేశంలో ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో సత్తా చాటారు. అయితే.. దక్షిణాదిన ఈ ధోరణి మరింత ఎక్కువ. కరుణానిధి, ఎమ్.జి.ఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు ముఖ్యమంత్రులుగానూ పనిచేసిన ఘనత సౌత్ సినీ ఇండస్ట్రీ సొంతం. అందుకే.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. సినిమాలకు సంబంధించిన ఎవరెవరు పాలిటిక్స్ లోకి దూకబోతున్నారు. ఏ రాజకీయ పార్టీలను స్థాపించబోతున్నారు? అనే చర్చ సాగుతూనే ఉంటుంది.

ఈకోవలోనే.. కోలీవుడ్ నుంచి దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనే చర్చ కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. అయితే.. లేటెస్ట్ గా విజయ్ పొలిటికల్ పార్టీని స్థాపించడానికి సమాయత్తమవుతున్నాడనేది తమిళనాట హోరెత్తిస్తున్న న్యూస్. రెండున్నర దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్. రజనీకాంత్-కమల్ హాసన్ తర్వాత తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా ఇలయదళపతి విజయ్ పేరునే చెప్పొచ్చు. ఇప్పటివరకూ రాజకీయ ప్రవేశం గురించి బహిరంగంగా ప్రకటించకపోయినా.. తాజాగా తన ఫ్యాన్ క్లబ్స్ తో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే హింట్ ఇచ్చాడట విజయ్. త్వరలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో విజయ్ తన పార్టీని బరిలో నిలుపుతాడనే ప్రచారం జరుగుతుంది.

Related Posts