దత్ సిస్టర్స్ దండయాత్ర.. ఆదర్శంగా అశ్వనీదత్ కూతుళ్లు

ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే చిన్నచూపు చూశారు. పేరెంట్స్ కూడా ఓ కొడుకు ఉంటే బావుండు అనుకున్నారు. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. కంటే కూతుర్నే కనాలి అంటున్నారు. ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు అమ్మా నాన్నలకు అంతులేని ఆనందాలను ఇస్తున్నారు. ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా వెలిగినా.. రెండు దశాబ్ధాల నుంచి భారీ విజయం కోసం చూస్తోన్న వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ కు ఇప్పుడు కూతుళ్లు విజయాలను ఇస్తున్నారు. స్వప్న సినిమా బ్యానర్ పై వరుస విజయాలు సాధిస్తోన్న ఈ సిస్టర్స్ దత్తు కళ్లల్లో ఆనందాల్ని నింపుతున్నారు.
2002లో వచ్చిన ఇంద్ర ఎంత పెద్ద విజయం సాధించిందో ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అందరికీ తెలుసు. అదే అశ్వనీదత్ కు నిర్మాతగా చివరి బ్లాక్ బస్టర్. ఆ తర్వాతా ఆ రేంజ్ సినిమా కోసం చాలా ప్రయత్నాలు చేసినా అన్నీ చేదు ఫలితాలనే ఇచ్చాయి. ముఖ్యంగా జై చిరంజీవా, కంత్రి, శక్తి వంటి చిత్రాలు మరింత పెద్ద షాక్ లు ఇచ్చాయి. ఈ క్రమంలో 2015లో తను ఎప్పుడో స్థాపించిన స్వప్న సినిమా బాధ్యతలను కూతుళ్లు తీసుకున్నారు. ప్రియాంకదత్, స్వప్న యాక్టివ్ గా స్రవంతి దత్ చేదోడుగా ఈ సంస్థను నిలబెట్టేశారు. వీరు చేసిన మొదటి ప్రయత్నం ఎవడే సుబ్రహ్మణ్యం. ఓ కొత్త దర్శకుడు నాగ్ అశ్విన్ ను నమ్మి చేసినా ఆ ప్రయత్నం సూపర్ హిట్ ను ఇచ్చింది.
ఎవడే సుబ్రహ్మణ్యం విజయంతో చాలా రోజుల తర్వాత అశ్వనీదత్ మొహంలో నవ్వులు పూయించారు కూతుళ్లు. తర్వాత నాగ్ అశ్విన్ తోనే మహానటి చిత్రాన్ని నిర్మించారు. ఇదంతా చిన్నవారి ప్రయత్నమే. బట్.. అనూహ్యమైన విజయం సాధించింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ తో పాటు మరెన్నో ప్రాంతీయ అవార్డులనూ సాధించి ఆడపిల్లల సత్తా ఏంటో చూపించారు. కేవలం డబ్బులు పెట్టడంలోనే కాదు.. స్వప్న, ప్రియాంకలు నిర్మాణంలో పాలు పంచుకుంటారు. తమకు ఏం కావాలో ఆ స్పష్టత కనిపిస్తుంది. అందుకే ప్రొడక్షన్ పరంగానూ బెస్ట్ క్వాలిటీని ఇస్తారు.
ఈ సారి మరో కొత్త దర్శకుడిని నమ్మి జాతిరత్నాలు నిర్మించారు. చాలా చిన్న సినిమాగా వచ్చిన జాతిరత్నాలు.. 2021లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అంటే కంటెంట్ ను నమ్మడం విషయంలోనూ వీరిలో ఓ పరిణతి కనిపిస్తుంది. నిజంగా ఇదే కథను అశ్వనీదత్ కు చెప్పి ఉంటే ఖచ్చితంగా సినిమా చేసేవాడు కాదు. బట్.. కంటెంట్ ను ఊహించడం కూడా పెద్ద టాస్కే. అఫ్‌ కోర్స్ వీరి విజయంలో ప్రియాంక భర్త.. దర్శకుడు నాగ్ అశ్విన్ హ్యాండ్ కూడా ఉంది. అయినా డెసిషన్ మేకర్స్ వీళ్లే కదా..?
ఏ నిర్మాతైనా సినిమాలు చేస్తూనే అభిరుచిని నిరూపించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈ కాలంలో మరింత టఫ్‌. బట్ ఈ దత సిస్టర్స్ ఆ విషయంలో బెస్ట్ అనిపించుకున్నారు. అందుకే ఇప్పుడు సీతారామం వంటి క్లాసిక్ మూవీ సాధ్యమైంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సీతారామం టాలీవుడ్ టాప్ క్లాస్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుందని అంతా చెబుతున్నారు. ఓ టాప్ ప్రొడ్యూసర్ గా తండ్రి విఫలమైన చోట కూతుళ్లుగా అశ్వనీదత్ కళ్లల్లో ఆనందాలు నింపుతోన్న ఈ కూతుళ్ల విజయయాత్ర ఇలాగే కొనసాగాలని కోరుకుందాం..

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

8 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

11 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

11 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

11 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

12 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

17 hours ago