నా క్యారెక్టర్ తో ఆకట్టుకుంటా

ఉదయ్‌ శంకర్‌, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గాళ్ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్‌ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. దర్శకుడు గురు పవన్‌ తెరకెక్కిస్తున్నారు. లవ్‌, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా గురించిహీరోయిన్ జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది.నేను ముంబై నుంచి వచ్చాను. ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ చేశాను..తర్వాత జర్నలిజం లో డిప్లొమాపూర్తయ్యాక యాక్టింగ్‌ కోర్సులో జాయిన్‌ అయ్యాను. వెస్ట్రన్ డాన్సులతో పాటు భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలుగు నుంచి ఆఫర్స్​‍ వచ్చాయి. నేను టాలీవుడ్‌లో చేసిన మొదటి చిత్రం బాయ్స్​‍ విల్‌ బీ బాయ్స్​‍. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.

ఆ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన సిద్ధం మనోహర్‌ ఈ నచ్చింది గాళ్ ఫ్రెండూ సినిమా కోసం రిఫర్‌ చేశారు. అలా ఈ చిత్రంలో అవకాశం వచ్చింది.అప్పుడు కోవిడ్‌ టైమ్‌ కాబట్టి ఫోన్‌ లోనే ఆడిషన్‌ ఇచ్చాను. దర్శకుడు గురు పవన్‌ నా ఆడిషన్‌ చూసి హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాలో నేను సంధ్య అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. శాండీ అని పిలుస్తుంటారు. ఈ పాత్రకు రెండు భిన్నమైన షేడ్స్​‍ ఉంటాయి. కొద్ది సేపు గ్రే షేడ్‌ క్యారెక్టర్‌లా అనిపిస్తుంటుంది. నా క్యారెక్టర్‌ వరకు ఒక మంచి ట్వస్ట్ కూడా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు తర్వాత సన్నివేశం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి కలిగింది. కథతో పాటు నా క్యారెక్టర్‌ చాలా బాగుండటంతో సినిమాను సంతోషంగా ఒప్పుకున్నానుఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బికినీ ధరించాను. బికినీ వేసుకున్నా…దర్శకుడు నన్ను అందంగా చూపించారు గానీ అసభ్యత అనిపించదు.

ఈ సీన్‌ కోసం రెండు రోజులు చాలా తక్కువగా ఫుడ్‌ తీసుకున్నాను. ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తానికి అన్ని ప్రధాన పాత్రలకు సంబంధం ఉంటుంది. ఒక వైపు ప్రేమ కథ సాగుతూనే థ్రిల్లర్‌ ఎలిమెంట్స్​‍ అండర్‌ కరెంట్‌గా ఉంటాయి. ఇందులో ఇన్వెస్ట్ మెంట్‌ యాప్‌ అంశం ఆసక్తికరంగా ఉంటుంది. దీని గురించి ఏమాత్రం ఎక్కువ చెప్పినా కథ రివీల్‌ అవుతుంది.హీరో ఉదయ్‌ శంకర్‌తో కలిసి నటించడం ప్లెజర్‌గా ఫీలవుతున్నాను. తెలుగు పరిశ్రమకు నేను కొత్త కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు. గురు పవన్‌ కథ విషయంలో పూర్తి స్పష్టత ఉన్న దర్శకుడు. సినిమాను ఎలా తెరకెక్కించాలో అవగాహనతో చేశారు. మాతో వర్క్​‍ చేయించుకునేప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఈ సినిమాలో మంచి పాటలు కుదిరాయి. వాటిని అందంగా పిక్చరైజ్‌ చేశారు. పరీక్షల సమయంలో ఒక విద్యార్థిని ప్రిపేర్‌ అయినట్లు తెలుగు నేర్చుకున్నాను.ఈ చిత్రంతో ఒక కొత్త తరహా ప్రయత్నం చేశాం. మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. తమన్నా, కృతి శెట్టి ఫీచర్స్​‍ నాలో ఉంటాయని చెప్పడం ఆనందంగా ఉంది. టాలీవుడ్‌లో నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్‌, నాయిక సమంత. అన్ని రకాల పాత్రలు చేసి పేరు తెచ్చుకోవాలని ఉంది.

Telugu 70mm

Recent Posts

మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ‘సత్య‘

సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…

6 hours ago

‘కన్నప్ప‘లో అక్షయ్ కుమార్ పోర్షన్ కంప్లీట్

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ…

6 hours ago

‘బాక్‘ సినిమా రివ్యూ

నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…

6 hours ago

ఆ… ఒక్కటీ అడక్కు‘ సినిమా రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…

7 hours ago

‘ప్రసన్నవదనం‘ రివ్యూ

నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుసినిమాటోగ్రఫి: ఎస్‌.చంద్రశేఖరన్‌సంగీతం:…

7 hours ago

Mahesh-Rajamouli film’s Muhurtham fix?

The combination Mahesh Babu - Rajamouli is eagerly awaited by movie lovers all over the…

10 hours ago