రజాకార్‌లో నటించడం నా అదృష్టం – అన్నుశ్రియ త్రిపాఠి

తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం , రజాకార్ల అరాచక పాలన , ఎదురు తిరిగిన తెలంగాణా విప్లవ యోధుల చరిత్రతో తెరకెక్కిన చిత్రం రజాకార్‌ . నాటి పోరాటాన్ని తెరకెక్కించిన విధానం అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. బాబీ సింహా, మకరంద్ దేశ్ పాండే, అనుశ్రీ, అనసూయా, ప్రేమ, ప్రధాన పాత్రలో, యాట సత్యనారాయణ దర్శకత్వంలో, గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ర‌జాకార్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన అనుశ్రీ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ర‌జాకార్’ ఈ నేల కథ. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకుల కళ్ళలో దేశభక్తి కనిపించింది. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలు థియేటర్స్ లో మార్మ్రోగడం చూసినప్పుడు ఇలాంటి సినిమాలో భాగం కావడం ఆనందంగా అనిపించిందన్నారు అనుశ్రీ.

బెంగళూర్‌ కాలేజ్ లో చదువుతున్నపుడే… ధియేటర్ గ్రూప్‌లో చేరి విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్నానని తెలిపారు. కాలేజ్ పూర్తయిన తర్వాత నేను సివిల్స్ కి చదవాలని నాన్నగారు కోరుకున్నాను. దాదాపు మూడేళ్ళు చదువుల్లోనే వున్నాను. అయితే నటిని కావాలనే కోరిక బలంగా వుండేది. ఆ కలని నెరవేర్చడం కోసం హైదరాబాద్ వచ్చానన్నారు.ఈ సినిమా లో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించాను. అప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం వెదుకుతున్నారు. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారన్నారు. వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే ఆ పాత్ర. కథ చెప్పినపుడు నా పాత్ర సవాల్ గా అనిపించింది. అలాగే ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో నా కల నెరవేరినట్లయిందన్నారు.

ర‌జాకార్ ‘లో నటించడం చాలా గొప్ప అనుభవం. చాలా మంది ప్రముఖ నటులతో కలసిపని చేసే అవకాశం వుంది. బాబీ సింహ, రాజ్ అర్జున్ తో పాటు మకరంద్ దేశ్ పాండే లాంటి అద్భుతమైన యాక్టర్ తో స్క్రీన్ పంచుడవడం గొప్ప అనుభూతి. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారామె.
రణబీర్ కపూర్, రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్ ని చాలా ఇష్టపడతాను. హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ ఇష్టం. మహానటిలో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్ లో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని కోరుకుంటానన్నారు అనుశ్రీ.

Related Posts