‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఊహించని సర్ప్రైజ్?

కొంతమంది నటులు కొన్ని తరహా పాత్రలలో అదరగొడతారు. అలాగే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే పోలీస్ రోల్ లో తన పవర్ చూపిస్తూ ఉంటాడు. తొలుత ‘గుడుంబా శంకర్’ సినిమాలో సరదాగా కాసేపు పోలీస్ క్యారెక్టర్ లో మురిపించిన పవన్.. ఆ తర్వాత ‘కొమరం పులి, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్‘ వంటి చిత్రాల్లో పోలీస్ గా కనిపించాడు. పోలీస్ డ్రెస్ లో ఒకవైపు తన పవర్ చూపిస్తూనే.. మరోవైపు తనదైన కామెడీని పండించడం పవర్ స్టార్ స్టైల్.

గబ్బర్ సింగ్‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ‘గబ్బర్ సింగ్’ తరహాలోనే కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఆమధ్య ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ నుంచి రిలీజైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ దక్కింది.

అయితే.. పవర్ స్టార్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో బ్రేక్ పడ్డ సినిమాల జాబితాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ కూడా ఉంది. ఈ సినిమా నుంచి బ్రేక్ రావడంతోనే డైరెక్టర్ హరీష్ శంకర్.. రవితేజాతో ‘మిస్టర్ బచ్చన్’ మొదలుపెట్టాడు. అయితే.. ఆల్ ఆఫ్ సడెన్ గా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘ఉస్తాద్..’ నుంచి అన్ ఎక్స్ పెక్టెడ్ అప్డేట్ ఇవ్వబోతున్నామని ప్రకటించింది.

అయితే.. ఆ అప్డేట్ ఏంటా? అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే.. ఈ మూవీ నుంచి డి.ఎస్.పి. కంపోజ్ చేసిన ఏదైనా సాంగ్ ను వదలబోతున్నారా? లేక మరో గ్లింప్స్ ఏమైనా రిలీజ్ చేస్తారా? లేక రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారా? ఇలా రకరకాలుగా ఆ అన్ ఎక్స్ పెక్టెడ్ అప్డేట్ గురించి ఊహాగానాలు చేస్తున్నారు అభిమానులు.

Related Posts