చిరంజీవి గారి మీద ప్రేమ వల్లనే గాడ్ ఫాదర్ చేశాను

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో గ్రాండ్ జరిగింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..’గాడ్ ఫాదర్’ లో ఒక బలమైన పాత్ర వుంది. లూసిఫర్ లో ఆ పాత్రని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. గాడ్ ఫాదర్ లో ఈ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బావుంటుందని భావించాం. మేము కోరగానే ”నేను చేయాలని మీరు కోరినట్లయితే మరో ఆలోచన లేకుండా చేస్తాను.

 మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తాను” అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్  ఓకే చేసిన తర్వాత ఈ సినిమా ఆరా మరింతగా పెరిగింది. షూటింగ్ లో మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భాయ్ గాడ్ ఫాదర్ లోకి రావడం..ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్ భాయ్ తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను. ఆ జోష్ ని తెరపై చూస్తారు” అన్నారు.సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను.  సినిమాల పట్ల చిరంజీవి గారికి, మాకున్న ప్రేమ దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది. సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నెంబర్స్ పెరుగుతాయి. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది” అన్నారు.

సత్యదేవ్ మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారి ముందు నిలుచుని మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్య గారిపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అన్నయ్యకి ఎదురుగా నటించడం పెద్ద  సవాల్. సల్మాన్ ఖాన్ గారి రూపంలో మరో సవాల్ వచ్చింది నవ్వుతూ). ఇద్దరు మెగాస్టార్లుకి ఎదురుగా నిలబడే పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎప్పుడూ ఊహీంచలేదు. నా బెస్ట్ ఇవ్వడనికి ప్రయత్నించాను. మోహన్ రాజా గారు సినిమాని చాలా కూల్ గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అక్టోబర్ 5న మీ అందరినీ అలరిస్తుంది” అన్నారు.దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లుని డైరెక్ట్ చేయడం నా కల నేరవేరినట్లయింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని ఇస్తుంది. సినిమా అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి” అని కోరారు.ఈ వేడుకలో నిర్మాతలు ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Telugu 70mm

Recent Posts

మే 3న థియేటర్లలో సినిమాల జాతర

మే 3న థియేటర్లలో సినిమాల జాతర ఉండబోతుంది. తెలుగు నుంచి మూడు సినిమాలు.. అనువాద రూపంలో మరొకటి కలిపి నాలుగు…

14 mins ago

Film fair in theaters on May 3

There will be a film fair in theaters on May 3. Three films from Telugu..…

15 mins ago

Is ‘Jai Hanuman’ getting too late?

After 'Hanuman' became a blockbuster, the expectations for the sequel 'Jai Hanuman' have increased. Director…

33 mins ago

‘జై హనుమాన్’ బాగా ఆలస్యమవ్వనుందా?

'హనుమాన్' బ్లాక్‌బస్టర్ సాధించడంతో సీక్వెల్ 'జై హనుమాన్'పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్…

38 mins ago

Is Vijay 69 trending on social media?

Tamil Ilayadalapathy Vijay is going to be busy with full-fledged politics soon. In this context,…

51 mins ago

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న విజయ్ 69?

తమిళ ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కాబోతున్నాడు. ఈనేపథ్యంలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోబోతున్నాడనే ప్రచారం…

55 mins ago