చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలకు అక్కడ భారీ టార్గెట్స్

తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ అనేది ఓ వరం అని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఓవర్సీస్ లో మన సినిమాలు కాసులు కురిపిస్తున్నాయి. రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమా నార్త్ అమెరికాలో సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి తెలిసిందే. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు మన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు.. విదేశాల్లో సైతం ఎగబడతారనడానికి ‘హనుమాన్’ నిదర్శనం.

ఇక.. తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే రెండు సినిమాలకు సంబంధించిన ఓవర్సీస్ టార్గెట్స్ భారీగానే ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’. ఏప్రిల్ లో ఉగాది కానుకగా విడుదలకు ముస్తాబవుతోన్న ‘దేవర’పై ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాజిటివ్ బజ్ ఉంది. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లో ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ యాక్షన్ అవతార్ లో మెస్మరైజ్ చేయబోతున్నాడు. లేటెస్ట్ గా ‘దేవర’ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను హంసిని ఎంటర్ టైన్ మెంట్ దక్కించుకుంది. ఈ డీల్ రూ.27 కోట్లట. అంటే.. ఓవర్సీస్ లో ‘దేవర’ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 5 నుంచి 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాలన్నమాట.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’కు సంబంధించి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి. యు.వి.క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సోసియో ఫాంటసీ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను సరిగమ సినిమాస్ రూ.18 కోట్లకు దక్కించుకుందట. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రోల్ డిఫరెంట్ షేడ్స్ తో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తన మార్క్ కామెడీని పంచుతూనే.. ముల్లోకాలలో సాహసాలు చేసే సాహసవీరుడిగా మెగాస్టార్ కనిపించనున్నాడట. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ షూట్ లో త్వరలోనే పాల్గొంటాడు చిరంజీవి.

Related Posts