Latest

హే.. హలో నమస్తే సాంగ్‌తో ‘పతంగ్’

తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలోని హే హ‌లో.. న‌మ‌స్తే హైద‌రాబాద్‌కు స్వాగతం అంటూ కొన‌సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌కు అంద‌రి నుండి మంచి స్పంద‌న వ‌స్తోంది.

అందరం కొత్త‌వాళ్లం న‌టించిన చిత్ర‌మిది. జోస్ జిమ్మి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌కు మంచి స్పందన వ‌స్తోంది. నేను హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన ప‌క్కా హైద‌ర‌బాదీని. నేను న‌టిస్తున్న ఈ చిత్రంలో హైద‌రాబాద్ గురించి సాంగ్‌లో స్టెప్పులేయ‌డం ఎంతో ఆనందంగా వుందన్నారు హీరో వంశీ పూజిత్.ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఎంతో ప్ర‌తిభ గ‌ల సంగీత ద‌ర్శ‌కుడు. ఈ సినిమా అంద‌రికి మంచి పేరును తీసుక‌వ‌స్తుంది అన్నారు.

ఓ సాంగ్‌కు కొరియోగ్ర‌ఫీ చేయాలంటే మంచి ట్యూన్‌తో పాటు ఆక‌ట్టుకునే లిరిక్స్ కావాలి. అలాంటి జోష్ ఈ సాంగ్‌లో వుంది. అందుకే మంచి స్టెప్స్ కుదిరాయి. ఈ పాట‌ను శంక‌ర్ మ‌హాదేవ‌న్ చాలా అద్బుతంగా పాడారు అన్నారు. నా ప్ర‌తిభ నిరూపించుకోవ‌డానికి ఈ సినిమా మంచి అవ‌కాశంగా భావిస్తున్నాన‌ని సంగీత ద‌ర్శ‌కుడు జోస్ జిమ్మి తెలిపారు. ఈ స‌మావేశంలో క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ నాని బండ్రెడ్డి, హీరోయిన్‌ ప్రీతి ప‌గ‌డాల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిఖిల్ కోడూరు, ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్, కాస్ట్యూమ్ డిజైన‌ర్: మేఘన త‌దిత‌రులు పాల్గొన్నారు.

TELUGU70MM TEAM

Recent Posts

జూలై నుంచి పట్టాలెక్కబోతున్న ‘కూలీ’

సూపర్ స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'కూలీ'. రజనీకాంత్ 171వ చిత్రంగా…

3 hours ago

న్యూయార్క్ నగరంలో ‘కల్కి’ ప్రమోషన్స్

మరికొద్ది గంటల్లో అమెరికాలో 'కల్కి' ప్రీమియర్స్ మొదలవ్వనున్నాయి. ఇప్పటికే ప్రి-టికెట్ సేల్స్ రూపంలో 'కల్కి' చిత్రానికి అమెరికా నుంచి మూడు…

3 hours ago

‘కమిటీ కుర్రోళ్లు’ నుంచి ప్రేమ గారడి గీతం

నూతన నటీనటులతో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. ఆద్యంతం విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో రొమాంటిక్…

3 hours ago

‘కల్కి’లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోతుందట

రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఎలా ఉంటుంది? ఆయన…

3 hours ago

Nag Ashwin is really great in that regard..!

If you take out the list of directors from Tollywood who have shown their ability…

8 hours ago

Big shock for ‘Kalki’.. Petition on increase in ticket rates in Andhra

The buzz of 'Kalki' has started all over the world. This movie will hit the…

8 hours ago