ఫ్రెండ్షిప్, లవ్, డివోర్స్ లతో వస్తోన్న హే సినామికా

సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ స్టార్స్ లో మళయాలం నుంచి దుల్కర్ సాల్మన్ ఒకడు. మమ్మూట్టి తనయుడుగా వచ్చినా.. చాలా త్వరగానే తనదైన ముద్రను వేశాడు. తండ్రిలాగానే చాలా వేగంగా సినిమాలు చేయడం దుల్కర్ అలవాటు. తన తరంలో చాలామందికి సాధ్యం కానీ యాభై సినిమాల మార్క్ ను కూడా ఎప్పుడో దాటేశాడతను. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం సినిమాతో తెలుగువారిని బాగా ఆకట్టుకున్నాడు. ఇక మహానటితో మరింత దగ్గరయ్యాడు. అలాగే అతని యాభైవ చిత్రంగా వచ్చిన కనులు కనులను దోచాయంటే మూవీ తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం తెలుగులోనే హను రాఘవూడి డైరెక్షన్ లో లెఫ్టినెంట్ రామ్ అనే స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు తను మళయాలంలో నటించిన హే సినామికా చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.
బలమైన కథలు ఎంచుకోవడంలో దుల్కర్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ ట్రైలర్ చూస్తే మరోసారి స్ట్రాంగ్ కంటెంట్ తోనే వస్తున్నట్టుగా కనిపిస్తోంది. దుల్కర్ వీడియో జాకీగా నటించాడు. అతను ఓ కథ చెబుతున్నట్టుగా మొదలైన ట్రైలర్ లో తనూ పాత్రధారి అవుతాడు. ఆ పాత్రలో తను మౌన అనే అమ్మాయిని ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. మౌనకు జాబ్ ఉంటుంది. కానీ తను మాత్రం ‘‘హౌజ్ హజ్బెండ్’’గా ఉంటాడు. ఆ టైమ్ లో తన ఫ్రెండ్ అతని లైఫ్ లోకి వస్తుంది. తను కాజల్. ఆ ఫ్రెండ్ వల్ల అతని మారీడ్ లైఫ్ డిస్ట్రబ్ అవుతుంది. దీంతో విడాకులు తీసుకోవాలనుకుంటాడు. ఇలా మొత్తంగా ముగ్గురు జీవితాల మధ్య సరదాగా మొదలైన కథ సంఘర్షణగా మారే క్రమంలో కనిపిస్తోంది ట్రైలర్.
దుల్కర్ ఎప్పట్లానే తనే అన్నిట్లోనూ హైలెట్ గా ఉండాలనుకోకుండా.. మరోసారి పూర్తిగా కథకే సరెండర్ అయినట్టు కనిపిస్తోంది. మౌనగా అదితిరావు హైదరి నటించింది. దుల్కర్ ఫ్రెండ్ కాజల్ పెళ్లి తర్వాతే నటించినట్టు కనిపిస్తోంది. తన లుక్ కూడా బాగా మారిపోయింది. మొత్తంగా ఈ సినిమాను మళయాలంలోనే కాదు.. తెలుగు, తమిళ్ లోనూ విడుదల చేయబోతున్నారు. మరి ఈ మూవీ విజయం సాధిస్తే.. తర్వాత తెలుగులో వచ్చే లెఫ్టినెంట్ రామ్ కు మరింత ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

Related Posts