మహేష్ ని మొత్తం మార్చేస్తున్నాడు

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే కథానాయకుడు కొత్తగా కనిపించాలి. తన సినిమాల్లో హీరోలను నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఆవిష్కరిస్తుంటాడు జక్కన్న. అందుకోసం హీరోలు కూడా తాము ఇంతకుముందు చేయనటువంటి సాహసాలు చేస్తుంటారు. మేకోవర్ పరంగా భిన్నంగా కనిపించడానికి కసరత్తులు ప్రారంభిస్తారు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో అదే జరుగుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళితో చేయబోతున్న తన 29వ ప్రాజెక్ట్ కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో ఉన్నాడు. ఇప్పటికే జర్మనీలోని అడవుల్లో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ లో ట్రెక్కింగ్ చేస్తూ ఈ అడ్వంచరస్ థ్రిల్లర్ కోసం సమయాత్తమయ్యాడు. ఇంకా.. ఫిజికల్ గా చాలా రిగరస్ ట్రైనింగ్ చేయబోతున్నాడు. ఓవరాల్ గా రాజమౌళి సినిమాతో ఓ కొత్త మహేష్ బాబు ను చూడబోతున్నామనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుపుకుంటోన్న SSMB29 త్వరలోనే ముహూర్తాన్ని జరుపుకోనుంది.

Related Posts