మరో చరిత్ర సృష్టించే పాత్రలో చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు చారిత్రక పాత్రలు అతికినట్టు సరిపోతాయి. ‘మగధీర’లో చరణ్ పోషించిన కాలభైరవ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మహా యోధుడైన సైనికుడిగా ఆ పాత్రలో చరణ్ రాజసాన్ని చూపించాడు. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం మరో అద్భుతమైన పాత్రలో వీరరసాన్ని వెండితెరపై ఆవిష్కరించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పవర్ ఫుల్ రోల్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడట రామ్ చరణ్.

బాలీవుడ్ లో హిస్టారికల్ డ్రామాలు తీయడంలో స్పెషలిస్ట్ సంజయ్ లీల భన్సాలీ. దశాబ్దాలుగా బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న భన్సాలీ.. ఎప్పటినుంచో సుహల్ దేవ్ అనే పోరాట యోధుడి గాధను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పదకొండో శతాబ్దానికి చెందిన ఆ వీరుడి కథను రామ్ చరణ్ తో చేయడానికి సమాయత్తమవుతున్నాడట. ఇప్పటికే భన్సాలీ హిస్టారికల్ డ్రామాలో పనిచేయడానికి చరణ్ కూడా అంగీకారాన్ని తెలిపినట్టు బాలీవుడ్ టాక్. మొత్తంగా.. త్వరలోనే చరణ్-భన్సాలీ కాంబో మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts