Categories: LatestMovies

డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టారా..?

సూపర్ హిట్  కాంబినేషన్స్ అంటే అందరికీ ఆసక్తే ఉంటుంది. ఆ కాంబో ఎప్పుడు రిపీట్ అయినా ఆడియన్సెస్ చూస్తారు. అలాంటిది హ్యాట్రిక్ కాంబో అయితే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. అలా తమిళ్ తో పాటు తెలుగులోనూ ఆకట్టుకున్న ఓ సూపర్ హిట్ కాంబో నాలుగో సినిమాకు సిద్ధం అవుతున్నారు. అంటే డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడుతున్నారన్నమాట. ఈ కాంబినేషన్ ఏంటా అని క్యూరియస్ గా చూస్తున్నారు కదూ..?
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. అతనికి అట్లీ తోడైన తర్వాత విజయ్ సినిమాల్లో సామాజిక అంశాల ప్రస్తావన పెరిగింది అనేది నిజం. అంతకు ముందు కేవలం రాజా రాణి అనే ఒకే ఒక్క సినిమా తీసిన అట్లీని విజయ్ నమ్మాడు. ఆ నమ్మకాన్ని అద్భుతంగా నిలబెట్టుకున్నాడు అట్లీ. వీరి కాంబోలో వచ్చిన తొలి సినిమా తెరి. ఈ చిత్రం తెలుగులో పోలీసోడు గా వచ్చి ఇక్కడా ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన మూవీ మెర్సల్. ఇదే పేరుతో ఇక్కడా డబ్ అయి విజయం అందుకుంది. రీసెంట్ గా వచ్చిన బిజిల్ కూడా తెలుగులో ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. ఈ మూడు చిత్రాలూ తమిళ్ లో బ్లాక్ బస్టర్లు.
అందుకే ఈ ఇద్దరూ కలిసి మరోసారి నటిస్తున్నారు అంటే ఖచ్చితంగా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది ఇంకా తెలియడం లేదు. అందుకు కారణం..
ప్రస్తుతం విజయ్ తెలుగు, తమిళ్ బై లింగ్వుల్ కు ఓకే చెప్పి ఉన్నాడు. అటు అట్లీ కూడా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు మూవీస్ పూర్తవడానికి దాదాపు యేడాదిన్నరకు పైనే పడుతుంది. ఆ తర్వాతే ఈ హ్యాట్రిక్ కాంబో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడుతుందన్నమాట.

Telugu 70mm

Recent Posts

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…

4 hours ago

బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీ.ఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…

4 hours ago

Pooja Hegde

4 hours ago

ఎన్టీఆర్ కు.. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డే విషెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…

5 hours ago

ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న ‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…

5 hours ago