ad

పవన్ కళ్యాణ్  కొన్ని కటౌట్స్ కు కంటెంట్ తో పనిలేకుండా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి కటౌట్స్ లో పవర్ స్టార్ ఒకరు. పవన్ వెండితెరపై కనిపించినా చాలు.. ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. హిట్టూ, ఫ్లాపులతో పనిలేకుండా పర్మనెంట్ ఫ్యాన్ బేస్ ఏకైక తెలుగు స్టార్. అలాంటి పవన్.. కొన్నాళ్లుగా ఫ్యాన్స్ తో పాటు మేకర్స్ ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కొత్త సినిమా అప్డేట్ విషయంలో అసలేం జరుగుతుందనే హింట్ కూడా రావడం లేదు. అసలు పవన్ ఇప్పటి వరకూ ఒప్పుకున్న సినిమాల పరిస్థితేంటీ.. అవి ఉంటాయా.. ఉండవా..?పవన్ కళ్యాణ్‌.. వకీల్ సాబ్ తో పాటు వరుసగా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. పవన్ కెరీర్ లో అన్ని సినిమాలు ఒకేసారి అనౌన్స్ కావడం ఫస్ట్ టైమ్. దీంతో ఎన్నికల టార్గెట్ గా ముందు ఈ చిత్రాలు ఫినిష్ చేసి ఆ తర్వాత పొలిటికల్ గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతాడు అనుకున్నారు చాలామంది. పవన్ కూడా అదే చెప్పాడు. ఎలక్షన్స్ కు డబ్బు కావాలి కదా అని. బట్ అనుకున్నది ఒకటి అవుతుంది మరోటీ అన్నట్టుగా మారింది సిట్యుయేషన్. వకీల్ సాబ్ తర్వాత రావాల్సిన సినిమా హరిహరవీరమల్లు. ఈ మూవీ సెట్స్ లో ఉండగానే సడెన్ గా భీమ్లా నాయక్ రీమేక్ ఎంటర్ అయింది. హరిహరను ఆపి మరీ భీమ్లా నాయక్ పూర్తి చేసి రిలీజ్ కూడా చేశారు. అయితే భీమ్లా ఫ్యాన్స్ కు వారు ఎక్స్ పెక్ట్ చేసినంత కిక్ ఇవ్వలేదు అనేది నిజం.భీమ్లా నాయక్ అయిపోయింది కాబట్టి.. ఇక హరిహర వీరమల్లునే నెక్ట్స్ అనుకున్నారు.

ఆ మధ్య కొన్ని స్టంట్స్ చేస్తూ ఫోటోషూట్ కూడా చేసి హడావిడీ చేశారు. మరి ఏమైందో.. ఈ మూవీ ఊసు వినిపించడం లేదు. కొందరు ఆగిపోయినట్టే అంటున్నారు. మరికొందరు పవన్ కు టైమ్ లేక అంటున్నారు. కారణం ఏదైనా ఈ మూవీ ప్రస్తుతానికి క్రాస్ రోడ్స్ లో ఉంది. దీంతో పాటు హరీష్‌ శంకర్ సినిమా కూడా అలాగే అయింది. అతనూ ఎన్నాళ్లుగానో పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటు వైపు నుంచి ఏ సంకేతం లేదు. పోనీ వేరే ప్రాజెక్ట్ చూసుకుందాం అనుకుంటే సడెన్ గా మధ్యలో పిలిస్తే ఎలా అని ఇన్నాళ్లూ ఆగిన హరీశ్ శంకర్ ఇక తన దారి తను చూసుకుంటూ భవదీయుడు భగత్ సింగ్ ను పక్కన బెట్టాడు అంటున్నారు.ఈ రెండు సినిమాలూ హోల్డ్ లో పడిపోవడానికి కారణం వినోదాయ సీతమ్ అనే తమిళ్ మూవీ రీమేక్ తెరపైకి రావడమే అనేది అందరికీ తెలుసు. ముందు ఒప్పుకున్న వాటిని వదిలేసి తర్వాత వచ్చిన సినిమాకు టైమ్ ఇవ్వడం ఎంత వరకూ కరెక్ట్ అని ఆ చిత్రాల నిర్మాతలు తెగ ఫీలైపోతున్నారట. ఫీలైతే మాత్రం పవన్ ను అడగగలరా.. అందుకే అడ్వాన్స్ లు ఇచ్చిన వాళ్లంతా కామ్ గా బాధపడుతున్నారని చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ రెండు స్ట్రెయిట్ చిత్రాలను వదిలేసి మరో రీమేక్ కు రెడీ అవుతున్నాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రీమేక్ లో మేనల్లుడు సాయితేజ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం చేయబోతోన్న ఈ మూవీ అయినా టైమ్ కు పూర్తవుతుందా లేదా అనేది చూడాలి.

, , , ,