పవన్ రెండు వారాలు సమయం ఇస్తే.. ‘OG‘ పూర్తవుతోందా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి పాలిటిక్స్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. పవన్ కిట్టీలో ‘OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు‘ చిత్రాలున్నాయి. వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చేది ‘OG‘. ‘సాహో‘ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘OG‘ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదలకు ముస్తాబవుతోంది.

విడుదల తేదీ ప్రకటించడంతో ‘OG’ అనుకున్న సమయానికి పూర్తవుతోందా? లేదా? అనుమానాలు అందిరలోనూ పెరుగుతున్నాయి. అయితే.. ఈ చిత్రంకోసం పవర్ స్టార్ కేవలం రెండు వారాల సమయం కేటాయిస్తే సరిపోతుందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ఇచ్చిన రెండు వారాల కాల్షీట్స్ లోనే పవన్ కి సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తిచేయనున్నాడట డైరెక్టర్ సుజీత్. గతంలో ‘వకీల్ సాబ్, భీమ్లా నాయక్’ చిత్రాల విషయంలో ఇలాగే జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా తక్కువ కాల్షీట్స్ తో ఆ చిత్రాలకు పనిచేశాడు. ఇక ఎన్నికల హడావుడి తర్వాత ‘OG’కి డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట పవన్.

Related Posts