వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ వసూళ్ల వర్షం కొనసాగుతూనే ఉంది. విడుదలై పాతిక రోజులైనా తగ్గేదే లే అంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ‘హనుమాన్‘ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్‘.. కేవలం 25 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు.
ఈ సంక్రాంతి బరిలో అగ్ర కథానాయకులు నటించిన సినిమాలొచ్చినా.. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్‘ అఖండ విజయాన్ని సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లోనూ భారీ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో.. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా కూడా సంక్రాంతి బరిలో విడుదలై ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించలేదు. అదే విషయాన్ని తెలుపుతూ ఆమధ్య 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతికి విడుదలై ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం తమదేనంటూ ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది టీమ్. మొత్తంమీద.. వరల్డ్ వైడ్ గా 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరిన ‘హనుమాన్‘.. మునుముందు ఇంకా ఎలాంటి వసూళ్ల రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.