రాజమౌళి టెక్నికల్ టీమ్ లో భారీ మార్పులు

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే ముందుగా గుర్తొచ్చే టెక్నీషియన్స్ విజయేంద్రప్రసాద్, కీరవాణి, సెంథిల్ కుమార్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ వంటి వారు. అయితే.. మహేష్ మూవీకి వీరిలో చాలామంది పనిచేయకపోవచ్చనేది లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్. మహేష్ 29వ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా.. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వీరిద్దరూ రాజమౌళి కుటుంబ సభ్యులే.

ఇక జక్కన్నతో సంవత్సరాల తరబడి ట్రావెల్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.. మహేష్ 29కి పనిచేయకపోవచ్చట. దర్శకధీరుడు రాజమౌళి విజన్ కు దృశ్య రూపం కల్పించడంలో సెంట్ పర్సెంట్ సక్సెస్ అయిన సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ ని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వం వహించిన 12 సినిమాల్లో.. ఏకంగా ఎనిమిది చిత్రాలకు సెంథిల్ కుమారే సినిమాటోగ్రాఫర్. అయితే.. ఈసారి మహేష్ మూవీకోసం పి.ఎస్.వినోద్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకోబోతున్నాడట రాజమౌళి. ‘సోగ్గాడే చిన్ని నాయనా, ధ్రువ, అరవింద సమేత, అల.. వైకుంఠపురములో, వకీల్ సాబ్, సీతారామం, గుంటూరు కారం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ బాగా సుపరిచితుడు పి.ఎస్.వినోద్.

మరోవైపు తన ఆస్థాన విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ ని.. కమల్ కణ్ణన్ తో రీప్లేస్ చేయబోతున్నాడట. ఇంకా.. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ని, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ లను కూడా మార్చే పనిలో ఉన్నాడట దర్శకధీరుడు. సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్ లు ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సిరీస్ తో ఫుల్ బిజీగా ఉండడం కూడా అందుకు కారణంగా తెలుస్తోంది.

Related Posts