కుర్రాళ్ల ఫైటు.. ఎవరికో ఆడియన్స్ ఓటు..?

కుర్రాళ్ల యంగ్ స్టర్స్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకటి తర్వాత రిలీజ్ లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో మిగతా కుర్ర హీరోల కంటే నిఖిల్ కాస్త స్పీడ్ గా ఉన్నాడు. కొన్నాళ్లుగా అతని సినిమా వెండితెరపై కనిపించలేదు. ఆ లోటును తీర్చేందుకు యేకంగా మూడు సినిమాలతో వస్తున్నాడు ఆ మూడు చిత్రాలూ ఈ యేడాదే చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. అందులో ముందుగా వస్తోన్న చిత్రం కార్తికేయ2. కొన్నాళ్ల క్రితం కార్తికేయగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నిఖిల్. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో యానిమల్ హిప్నాటిజం అంటూ కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేసి థ్రిల్లింగ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి దానికి సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అద్భుతంగా ఉందనే టాక్ తెచ్చుకుంది. ఈ ట్రైలర్ చూస్తే మరోసారి హిట్ కొట్టబోతున్నారనదీ అర్థం అవుతోంది. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రాబోతోన్న ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.అయితే జూలై 22నే అక్కినేని నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ చిత్రాన్నీ విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ మూవీని జూలై 8న రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ సడెన్ గా పోస్ట్ పోన్ చేశారు. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన తర్వాత కూడా మళ్లీ ఎందుకు రిలీజ్ డేట్ మార్చారో కానీ థ్యాంక్యూ మూవీపైనా భారీ అంచనాలే ఉన్నాయి. చైతూతో గతంలో మనం చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ కుమార్ ఈ మూవీకి దర్శకుడు. అయితే కొన్నాళ్లుగా విక్రమ్ ఫామ్ లో లేడు. మనం తర్వాత వచ్చిన మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇటు చైతూ మాత్రం వరుస హిట్స్ తో జోష్ లో ఉన్నాడు. ప్రేమమ్ తర్వాత మూడు ఏజ్ గ్రూప్ లలో కనిపిస్తున్నట్టుగా టీజర్ చూస్తే అర్థమైంది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ మూవీ ఖచ్చితంగా చైతూకు మంచి విజయాన్ని ఇస్తుందని చెబుతున్నారు.మొత్తంగా తెలుగు సినిమాలుగా ఈ రెండూ ఒకే రోజు బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అయ్యాయి. కుర్రాళ్లిద్దరూ జోష్‌ గా ఉన్నారు. మరి వీరిలో ఆడియన్స్ ఓటు ఎవరికి వేస్తారో కానీ.. వీరికి పోటీగా మరో భారీ చిత్రం కూడా అదే రోజు విడుదలవుతోంది. కాకపోతే ఇది బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ స్టార్ రణ్‌ బీర్ కపూర్ నటించిన షంషేరా కూడా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా జూలై 22నే వస్తోంది. సో ద ఫైట్ ఈజ్ ట్రైయాంగిల్ అన్నమాట. విశేషం ఏంటంటే ఈ మూడు చిత్రాలూ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. అయినా స్పష్టమైన ఆధిపత్యం ఎవరిది అవుతుందో చూడాలి.

Related Posts