చిన్న సినిమాలు పెద్ద ఫ్లాపులుగా నిలిచాయా..?

చిన్న సినిమారావడానికి అరడజను సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయింది. టాలీవుడ్ కు ఇది కాస్త నిరాశపరిచే వార్తే. అయినా ఇంతమంది ఒకే రోజు ఫైట్ చేస్తే ఒక్కరు కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకోలేకపోవడం దురదృష్టం. లేదూ క్రియేటివిటీ లేకపోవడం కూడా. నిజానికి వీటిలో రెండు మూడు సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి ఉంది. కానీ అవి కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యలతో మరింత ఫేమ్ అయిన సినిమా చోర్ బజార్. పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన సినిమా ఇది. దళం, జార్జిరెడ్డి వంటి చిత్రాలు చేసిన జీవన్ రెడ్డి ఈ మూవీకి దర్శకుడు. రిలీజ్ కు ముందు కొంత అంచనాలున్న ఈ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. చాలామంది అవుట్ డేటెడ్ అనేశారు.ఇక ఫస్ట్ మూవీ రాజా వారు రాణిగారుతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కుర్ర హీరో కిరణ్ అబ్బవరపు ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాతోనూ ఆకట్టుకోలేకపోయాడు. అతని నేపథ్యం చూసి చాలామంది అభిమానించారు. అతనూ మంచి సినిమా లవర్. స్వయంగా మాటలు, స్క్రీన్ ప్లే రాసుకోగలడు. అయితేనేం..

మంచి కథలు ఎంచుకోలేకపోతే అవేవీ వర్కవుట్ కావు అని మరోసారి అతని లేటెస్ట్ మూవీ సమ్మతమే నిరూపించింది. ఈ మూవీకి ఫస్ట్ హాఫ్‌ బానే ఉంది అన్న టాక్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్‌ తేలిపోయింది. రెండో భాగం బాలేకపోతే ఏ సినిమా కూడా నిలబడదు అని ఈ మూవీ మళ్లీ ప్రూవ్ చేసింది. కిరణ్‌ కు మరో ఫ్లాప్ గా నిలిలిచింది.ఎప్పుడో ఫామ్ కోల్పోయిన రామ్ గోపాల్ వర్మ చేసిన మరో విఫల ప్రయత్నం.. కొండా. వరంగల్ కు చెందిన కొండా మురళి దంపతుల బయోపిక్ లాంటి సినిమాగా వచ్చిన ఈ మూవీ.. వర్మ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ ఎప్పట్లానే డిజాస్టర్ అనిపించుకుంది.వీరితో పాటు వచ్చిన ఎమ్మెస్ రాజు స్వీయ దర్శకత్వ చిత్రం 7డేస్ 6నైట్స్, గ్యాంగ్ స్టర్ గంగరాజు, కరణ్‌ అర్జున్, సాఫ్ట్ వేర్ బ్లూస్, ససదా నన్నునడిపే అనే చిన్న చిత్రాలు వచ్చాయి. బట్ వీటి గురించి పెద్దగా తెలిసింది కూడా లేదు. సో.. అవీ కూడా డిజాస్టర్స్ గా నిలిచి.. చిన్ని నిర్మాతలకు పెద్ద నష్టాలను తెచ్చాయి.ఏదేమైనా మళ్లీ చిన్న సినిమాలకు మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేకపోతే తర్వాత పెద్ద సినిమాలను నిందించడానికి ఏమీ ఉండదు. పైగా కంటెంట్ లేకుండా కేవలం కాసుల యావలో వస్తే మాత్రం లాసులు తప్పవు అని ఈ సినిమాలన్నీ నిరూపిస్తున్నాయి.

Related Posts