‘గుంటూరు కారం’ సెన్సార్ టాక్.. పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ!

సంక్రాంతి సినిమాలన్నీ ఒక్కొక్కటిగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంటున్నాయి. దాదాపు అన్ని సినిమాలకూ ‘యు/ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. ఇక.. సంక్రాంతి బరిలో ముందుగా.. హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ కూడా లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.

సెన్సార్ రిపోర్ట్ విషయానికొస్తే.. ఈ సంక్రాంతి బరిలో ‘గుంటూరు కారం’ పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, మాస్ యాక్షన్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తాయట. క్లాస్ స్టోరీస్ కు మాస్ టచ్ ఇచ్చే మాటల మాంత్రికుడు ఈసారి.. రమణ గాడి మాస్ జాతరను పక్కా మాస్ అవతార్ లో ఆన్ స్క్రీన్ పై ఆవిష్కరించాడట. మునుపటి మహేష్-త్రివిక్రమ్ చిత్రాలకు మించిన రీతిలో ‘గుంటూరు కారం’ బ్లాక్ బస్టర్ సాధిస్తుందనే టాక్ అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది.

‘సలార్’ మూవీ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు స్టార్ పవర్ ఉన్న చిత్రమిది. అందుకే.. ‘సలార్’ తరహాలోనే ‘గుంటూరు కారం’కి కూడా స్పెషల్ ప్రీమియర్ షోస్ వేయబోతున్నారట. అర్థరాత్రి 1 గంట నుంచే ‘గుంటూరు కారం’ షోస్ వేసుకోవడానికి పర్మిషన్ వచ్చినట్టు తెలుస్తోంది.

Related Posts