కీరవాణి స్వర రచనా విన్యాసంతో ‘నా సామిరంగ’ గీతం

కింగ్ నాగార్జున, కీరవాణి కాంబినేషన్ అనగానే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ మన మదిలో మెదులుతాయి. తన తమ్ముడైన రాజమౌళికి మించిన రీతిలో నాగార్జునతో ఎక్కువ సినిమాలకు పనిచేశాడు కీరవాణి. ఇక.. ఆస్కార్ విజేత అయిన తర్వాత తొలిసారి నాగార్జునతో కీరవాణి పనిచేస్తున్న సినిమా ‘నా సామిరంగ’. ఈ సంక్రాంతికి పక్కా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చే చిత్రంగా ఈ మూవీ ఉండబోతున్నట్టు ఇప్పటికే ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా ‘నా సామిరంగ’ నుంచి థర్డ్ సింగిల్ ‘విజిల్ థీమ్’ సాంగ్ రిలీజయ్యింది.

కీరవాణి సంగీతంతో పాటు సాంగ్ కి రచన కూడా చేశాడు. ‘దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం.. అంజి ది కిష్టయ్య ది.. విడదీయని ఒక బంధం.. చిరునవ్వులు పూసే స్నేహం’ అంటూ నాగార్జున, అల్లరి నరేష్ పాత్రల స్నేహ మాధుర్యాన్ని తెలియజేసే గీతమిది. ఆస్కార్ విజేత స్వర రచనా విన్యాసంతో ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శాండిల్య పీసపాటి ఈ పాటను అద్భుతంగా ఆలపించాడు. విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘నా సామిరంగ’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts