‘ఆర్.సి.16’ నుంచి క్రేజీ అప్డేట్.. కీలక పాత్రలో కన్నడ స్టార్

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రానున్న సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్’ ఒకటి అయితే.. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందే ‘ఆర్.సి.16’ మరొకటి. ఈ సినిమాలు రెండూ వేటికవే విభిన్నంగా.. ఎంతో స్పెషల్ గా రూపొందుతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే.. ఇది పక్కా శంకర్ మార్క్ మూవీ. శంకర్ తరహా భారీతనంతో.. సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్ నటించే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి టెక్నీషియన్స్, ఆర్టిస్టుల ఎంపిక కూడా వేగవంతమైంది. ఇప్పటికే ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు కన్ఫమ్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ మూవీలో ఓ కీలక పాత్రకోసం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను తీసుకున్నారట. ఈ విషయాన్ని శివరాజ్ కుమార్ స్వయంగా తెలిపాడు. గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలో కేమియోలో మురిపించిన శివన్న.. తెలుగులో నటించే ఫుల్ లెన్త్ రోల్ ఇదే కానుంది. ఈ మార్చి నుంచే ‘ఆర్.సి. 16’ పట్టాలెక్కనుందట.

Related Posts