గ్రాండ్ గా గామా అవార్డ్స్ ట్రోఫీ లాంచ్‌

ఆస్కార్‌ అవార్డ్స్‌ ఎలాగో.. తెలుగు వారికి గామా అవార్డ్స్ అంత ప్రత్యేకమైనవి అంటున్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి. తెలుగు గామా అవార్డ్స్ 2024.. ఫోర్ట్‌ ఎడిషన్‌ కర్టెన్‌ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీ వీ వీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి,గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీను లాంచ్ చేశారు.

గతంలో గామా అవార్డ్స్‌ అంగరంగ వైభవంగా నిర్వహించేవారమనీ… కోవిడ్‌ వల్ల ఈ మూడేళ్లు గ్యాప్ వచ్చిందన్నారు సంగీత దర్శకులు కోటి. ఈసారి దుబాయ్‌లో గామా అవార్డ్స్‌ అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు” అని చెప్పారు.

ఈ జ్యూరీలో సభ్యుడిగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి త్రిమూర్తులు గారు నిర్వహిస్తున్న ఈ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా చెప్పుకోవచ్చన్నారు డైరెక్టర్‌ వి.ఎన్‌ ఆదిత్య.ఈ వేడుక నిర్వహిస్తున్న త్రిమూర్తులు గారిని మెచ్చుకున్నారు ప్రొడ్యూసర్ డివివి దానయ్య.డింపుల్‌ హయాతి మాట్లాడుతూ… తన పర్‌ఫార్మెన్స్‌ ప్రధానాకర్షణగా ఉండబోతుందన్నారు.
ఆస్కార్ పురస్కారం అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ల‌కు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’తో పాటు, ప్రఖ్యాత గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను గాయకులు మనోకి అందిస్తున్నామని గామా అవార్డ్స్ దర్శకులు ప్రసన్న పాలంకి తెలియజేశారు.

Related Posts