పిల్ల బచ్చాలూ… మా సినిమాకి రాకండి – తంత్ర మూవీ హెచ్చరిక

పిల్లలు, బచ్చాలు మా సినిమాకి రావొద్దు.. అంటూ హెచ్చరిస్తున్నారు మేకర్స్‌. సాధారణంగా అందరూ సినిమా చూడండి అంటారు. కానీ వీళ్లిలా ప్రచారం చేయడానికి కారణం.. సెన్సార్‌ A సర్టిఫికెట్ ఇవ్వడమే. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ని సరికొత్తగా అనౌన్స్‌చేస్తూ.. సినిమాను ప్రమోట్ చేయడం తంత్ర మూవీ టీమ్‌ కే చెల్లింది.
అనన్య నాగళ్ల మెయిన్‌ లీడ్ చేస్తున్న ఈ మూవీలో శ్రీహరి ఫ్యామిలీ నుంచి దినేష్ రఘుముద్రి మేల్‌ లీడ్ చేస్తున్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. ‘ధీరే ధీరే’ సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది.
ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవిచైతన్య ప్రకటించారు.

Related Posts