అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ సోగ్గాడే చిన్నినాయనకు సీక్వెల్ వచ్చేస్తోంది. ఈ సారి నాగ్ తో పాటు తనయుడు నాగచైతన్య కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు అన్నప్పుడే ప్రాజెక్ట్ పై మంచి అంచనాలున్నాయి. పైగా ఈ కథ విషయంలో నాగ్ అస్సలే మాత్రం కాంప్రమైజ్ కాలేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో అనేక వెర్షన్స్ రాయించారు. చివరికి సీనియర్ రైటర్ సత్యానంద్ సాయం కూడా తీసుకున్న తర్వాతే కథ పట్టాలెక్కింది. ఆ తర్వాతే షూటింగ్ మొదలుపెట్టారు. విశేషం ఏంటంటే.. చాలా పెద్ద స్పాన్ కనిపిస్తోన్న ఈ చిత్రం చాలా తక్కువ టైమ్ లోనే పూర్తి చేశారు. యస్.. బంగార్రాజు చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి బరిలో జనవరి 15న విడుదల కాబోతోన్న ఈ మూవీ టీజర్ ను న్యూ ఇయర్ స్పెషల్ గా రిలీజ్ చేశారు.
ఈ సారి చైతన్యకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలా కనిపిస్తోంది. అయితే మళ్లీ యమలోకంలో ఉన్న పాత్రను కిందికి ఎలా తీసుకువచ్చారు అనేదే కీ పాయింట్ లా కనిపిస్తోంది. రమ్యకృష్ణ ఎప్పట్లానే అదే పాత్రలో నటించింది. నాగ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చైతన్య కూడా తండ్రిలా రొమాంటిక్ యాంగిల్ లోనే ఈ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి ఊరికి సర్పంచ్ అయిన సందర్భంలో చే చెప్పిన డైలాగ్స్ బావున్నాయి. ‘నువ్వు ఈ రాష్ట్రానికి, దేశానికే సర్పంచ్ కావాలి’అనడం ఫన్నీగా ఉంది. కృతి కూడా చాలా బెటర్ అయినట్టుంది. మొత్తంగా టీజర్ లో రొమాన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశారు.
ఇక ఈ సంక్రాంతికి భారీ పోటీ ఉంటుందనుకున్నారు. బట్ ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడటంతో పాటు భీమ్లా నాయక్ బరిలో లేకపోవడంతో ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాగా కేవలం బంగార్రాజు మాత్రమే నిలుస్తుంది. సో ఈ ఛాన్స్ నాగ్ కు బాగా కలిసొచ్చినట్టే చెప్పాలి. మరి ఆ అవకాశాన్ని బంగార్రాజు బ్లాక్ బస్టర్ తో నిలుపుకుంటాడా లేడా అనేది చూడాలి.
Malayali beauty Anupama Parameswaran is in full form. She gave a glamorous performance as Lily…
Dhanush is the only young actor to have won the National Award for Best Actor…
Currently, the election rush is in full swing in the whole country. Especially.. In Andhra…
Rahul Vijay and Shivani Rajasekhar, who had a good success with the movie 'Kota Bommali…
'Arya' movie.. Allu Arjun is the hero of the movie. The film that gave life…
Manchu Vishnu is producing the mega project 'Kannappa'. This film is being made with a…