‘గాడ్ ఫాదర్’ థార్ మార్ పాట విడుదల

ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి మెగా మాస్ జాతర సృష్టించిన గాడ్ ఫాదర్ ‘థార్ మార్’ సాంగ్ ప్రోమో మెగా డ్యాన్స్ నంబర్‌పై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇద్దరు మెగాస్టార్‌లు తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో తాజాగా విడుదలైయింది. ఈ పాట నిజంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్‌ను గ్లోరిఫై చేయడంతో పాటు చూడటానికి విజువల్ ట్రీట్‌గా వుంది.ఈ మెగా మాస్ ఫీస్ట్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ హుక్ స్టెప్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పాటకు తమన్ స్కోర్ చేసిన ఫంకీ బీట్‌ మళ్ళీమళ్ళీ వినాలనిపించే మెగా డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ వీడియోలో చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా, సల్మాన్ తన గోళ్లు కొరుకుతూ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు మెగాస్టార్లు నల్లటి దుస్తులను ధరించి, బ్లాక్ షేడ్స్‌లో అదరగొట్టారు.

శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేసి ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌కు అదనపు ఆకర్షణ జోడించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఈ వీడియోలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, చిత్ర బృందం సరదాగా షూటింగ్ చేస్తున్న విజువల్స్ కూడా వున్నాయి.గాడ్ ఫాదర్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం.కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

56 mins ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

5 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

5 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

8 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

9 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

11 hours ago