“ధమాకా” గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ “ధమాకా”. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘జింతాక్’కు అద్భుతమైన  స్పందన వచ్చింది.తాజాగా ధమాకా చిత్ర యూనిట్ అదిరిపోయే కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల వినాయక చవితి సందర్భంగా సాయంత్రం 5:01 గంటలకు విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కలర్‌ ఫుల్‌ గా, రొమాంటిక్‌ గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త  టెన్షన్ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది,

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

తారాగణం: రవితేజ, శ్రీలీల

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: త్రినాధరావు నక్కిన

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో: వంశీ శేఖర్

Telugu 70mm

Recent Posts

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…

5 hours ago

బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీ.ఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…

6 hours ago

Pooja Hegde

6 hours ago

ఎన్టీఆర్ కు.. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డే విషెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…

6 hours ago

ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న ‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…

6 hours ago