కాజ‌ల్ త‌ల్లి కాబోతుంద‌ని బ‌య‌ట‌పెట్టిన గౌతమ్

అందాల చంద‌మామ కాజ‌ల్ ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. ఆమ‌ధ్య కాజ‌ల్ గౌత‌మ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య సినిమాలో న‌టించింది. కింగ్ నాగార్జున స‌ర‌స‌న ఘోస్ట్ సినిమాలో న‌టిస్తుండ‌గా ఈ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కార‌ణం ఏంటంటే.. కాజ‌ల్ త‌ల్లి కాబోతుంద‌ని.. అందుక‌నే నాగార్జున సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని తెలిసింది.

అయితే.. వార్త‌లు అయితే వచ్చాయి కానీ.. కాజ‌ల్ ప్రెగ్నెంట్ అనే విష‌యం ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా ఉంటే.. న్యూ ఇయర్‌ వేడుకల కోసం గౌత‌మ్ కిచ్లూ, కాజ‌ల్ జంట గోవాకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన గౌతమ్‌.. 2022.. నిన్నే చూస్తున్నాఅంటూ ప్రెగ్నెంట్‌ లేడీ ఎమోజీని ఎటాచ్‌ చేశారు. దీనిని చూసిన అభిమానులు కాజల్‌ – గౌతమ్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

కాజ‌ల్ న‌టించిన‌ ఆచార్య చిత్రం ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కానుంది. యూనివ‌ర్శిల్ హీరో క‌మల్ హాస‌న్ తో క‌లిసి భారతీయుడు – 2 సినిమా షూటింగ్ లో పాల్గొంది. అయితే.. ప్రెగ్నెంట్‌ కావడంతో భారతీయుడు-2 నుంచి కూడా ఆమె తప్పుకొన్నారని సమాచారం.

Related Posts