ఒకే వేదికపైకి టాలీవుడ్ నాలుగు స్తంభాలు?

తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. దశాబ్దాలుగా చిత్ర సీమను ఏలుతున్న ఈ నట దిగ్గజాలు.. ఇప్పటికీ హీరోలుగా దూకుడు చూపిస్తూనే ఉన్నారు. యువ కథానాయకులకు మించిన రీతిలో సినిమాల స్పీడు పెంచుతున్నారు. ఇక.. సమయం రావాలే కానీ ఈ నలుగురు కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. మళ్లీ అలాంటి వేడుక రాబోతుంది.

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్ఠాత్మక 75వ చిత్రంగా రూపొందుతోంది ‘సైంధవ్’. ఈ సినిమాకోసం ఈరోజు గ్రాండ్ సెలబ్రేషన్స్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున పాల్గొంటారట. అలాగే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ వేడుకలో అతిథిగా అలరించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శైలేష్ కొలను ‘సైంధవ్’ని తెరకెక్కిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రెడీ అవుతోన్న ‘సైంధవ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts