అన్నీ పోతున్నాయి.. అయినా ఎలా..?

ఏ హీరోకైనా ఒకటీ రెండు ఫ్లాపులు వస్తే అంతే సంగతులు. స్టార్స్ కైతే ఫర్వాలేదు కానీ.. స్టార్డమ్ కోసం కాక కనీస గుర్తింపు కోసం ట్రై చేసే వారికైతే ఇంక చెప్పేదేముందీ. అలాంటి హీరోల్లో ఒకడు ఆది సాయికుమార్. మొదట్లో అతని ఎంట్రీ లవ్ లీగానే ఉంది. తర్వాతే మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి ఏ ఇమేజ్ కూ కాకుండా పోయాడు.ఇక ఆది హిట్ అనే మాట చూసి ఏళ్లవుతోంది. కొన్నాళ్లుగా అతన్నుంచి ఓ సినిమా వస్తోందంటే అది ఫ్లాప్ కావడానికే అన్నట్టుగా మారిపోయింది సిట్యుయేషన్. చెబితే ఆశ్చర్యపోతారు కానీ.. ఇప్పుడు అతని చేతిలో ఎన్ని సినిమాలున్నాయో లేక్కేలేదు. ఇప్పటికే రిలీజ్ కే మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. లేటెస్ట్ గా మరోటి మొదలైంది. నిన్ననే తీస్ మార్ ఖాన్ అనే సినిమా టీజర్ విడుదల చేశారు. ఇవాళ మరో కొత్త సినిమా ప్రారంభం అయింది.ఆది సాయికుమార్ కు టాలెంట్ ఉంది. కానీ స్టోరీ సెలెక్షన్ లోనే రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడు. సాయికుమార్ లాంటి స్టార్ ఫాదర్ ఉన్నా.. అతనికీ ఇతనికి ఎలాంటి స్క్రీప్ట్స్ సెలెక్ట్ చేయాలో అర్థం కాకపోవడం విశేషమే మరి. కొన్నాళ్లుగా ఆది భార్య కూడా కథా చర్చల్లో భాగస్వామి అవుతోంది. ఆమె ఇన్వాల్వ్ అయిన తర్వాత మొదలైన సినిమాలేవీ ఇంకా విడుదల కాలేదు. ఆ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న సిఎస్ఐ సనాతన్, లేటెస్ట్ గా టీజర్ విడుదలైన తీస్ మార్ ఖాన్ కథల్లో ఆమె కూడా పార్టిసిపేట్ చేసిందట. మరి ఈ రెండు సినిమాల రిజల్ట్స్ ఎలా ఉంటాయనే దాన్ని ఆమె టేస్ట్ కూడా తేలిపోతుంది. ఇక ఇవాళ మొదలైన సినిమాలో తనలాగే స్ట్రగుల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు.
అయితే ఇన్ని సినిమాలువరుసగా పోతున్నా.. ఆది సాయికుమార్ కు వరుసగా అన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి అనే డౌట్ చాలామందిలో ఉంది. అసలు ఇన్ని ప్రాజెక్ట్స్ చేయడం ఎలా సాధ్యం అనే అనుమానం కలిగితే ఆశ్చర్యం లేదు. అయితే దీనికి స్పష్టమైన సమాధానం కూడా ఉంది. యస్.. ఆదితో సినిమా ఓకే అయితే అతన్నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. స్కూల్ పిల్లాడిలా షూటింగ్ కు వచ్చి చెప్పింది చేసి వెళ్లిపోతాడు. గొంతెమ్మ కోరికలు ఉండవు. స్క్రిప్ట్ లోనూ, డైరెక్షన్ లోనూ వేళ్లు పెట్టడు. ఓ రకంగా ఇదీ అతని ఫెయిల్యూర్ కు ఓ కారణం అయినా.. కొత్తగా వచ్చే దర్శకులకు అతను మంచి ఆప్షన్ గా నిలుస్తున్నాడు. దర్శకులు సరే మరి ఇన్ని సినిమాలు పోతున్నాయి కదా.. ఇంక నిర్మాతల పరిస్థితి ఏంటా అనుకుంటున్నారేమో.. ? దానికీ సమాధానం ఉంది.

నిజానికి ఆది సినిమాల బడ్జెట్ రెండు మూడు కోట్లు. మహా అయితే నాలుగు కోట్లు. అంతే. ఇందులోనే రెమ్యూనరేషన్స్ కూడా ఉంటాయి. ఎంత తక్కువకు థియేట్రికల్ రైట్స్ అమ్మేసినా తర్వాత శాటిలైట్ పరంగా కొంత వరకూ అతని సినిమాలకు ఇప్పుడు మార్కెట్ ఉంది. ఓటిటి ఎలాగూ ఉంది. వీటికి మించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంతమంది నిర్మాతలు ఆది వెనక పడటానికి మరో ప్రధాన కారణం అతని హిందీ డబ్బింగ్ మార్కెట్. సర్ ప్రైజ్ అవుతున్నారు కదూ..యస్.. ఆది హిందీ డబ్బింగ్ మార్కెట్ ఇప్పటికీ సింపుల్ గా రెండు కోట్లు ఉంది. కాస్త నాలుగైదు ఫైట్స్ ఉంటే అది ఇంకా పెరుగుతుందన్నమాట. సో నిర్మాతలు సేఫ్. పెద్దగా హడావిడీ లేకుండానే థియేటర్స్ లో ఆ సినిమాలు పోయినా నిర్మాతలు మాత్రం లాస్ అవడం ఉండదు. అదీ మేటర్. అందుకే ఆదితో సినిమా చేయడానికి ఇంతమంది దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు.దీనికి కాస్త విజయాలు కూడా తోడైతే అతని మార్కెట్టూ పెరుగుతుంది. మరి అదెప్పుడు అనేది ఎవరికీ తెలియదేమో..

Related Posts