Advertisement
సత్యదేవ్ ను హీరో మెటీరియల్ కాదంటున్నారే
Latest Movies Tollywood

సత్యదేవ్ ను హీరో మెటీరియల్ కాదంటున్నారే

Advertisement

పూరీ జగన్నాథ్ ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. అంతకు ముందు ఒకటీ అరా సినిమాల్లో కనిపించినా పూరీ పరిచయం తర్వాత సత్యదేవ్ ఎక్కువమందికి తెలిశాడు. ముఖ్యంగా ఛార్మీ ప్రధాన పాత్రలో నటించిన జ్యోతిలక్ష్మి సినిమాతో బాగా రిజిస్టర్ అయ్యాడు. అప్పటి నుంచి చాలా సినిమాల్లో ప్రధాన, కీలక పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నాడు. ప్రకాష్‌ రాజ్ లాంటి నటుడు చేత కూడా మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న సత్యదేవ్ ఆ మాటను ప్రతిసారీ నిజం చేస్తూనే ఉన్నాడు.కానీ హీరోగా ట్రై చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిపోతోంది. ఆ మధ్య చేసిన బ్లఫ్ మాస్టర్, రాగల 24గంటల్లో, 47డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వాగోరింక, తిమ్మరుసు, స్కైలాబ్.. ఇలా వరుసగా నటించిన సినిమాలేవీ అతన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి అనేది సత్యం. ఇక లేటెస్ట్ గా వచ్చిన గాడ్సే కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. ప్రతి సినిమాలోనూ సత్యదేవ్ బానే నటించాడు అన్నారు కానీ.. హీరో సత్యదేవ్ గా గుర్తించ లేదు అనేదీ నిజం.కొంతమందిని చూడగానే ఫలానా పాత్రకు భలే ఉంటాడు అనిపిస్తుంది. అలాంటి కేటగిరీ నటుడే సత్యదేవ్. అంతేకానీ ఫలానా సినిమాలో హీరోగా సత్యదేవ్ చేసి ఉంటేనా అనే కమెంట్స్ ఈ తరహా నటుల విషయంలో వినిపించవు. అఫ్‌ కోర్స్ సత్యదేవ్ కూడా ఎప్పుడూ ఎక్కడా తను హీరో అనే భేషజం చూపించలేదనుకోండి. కానీ ఇలా ప్రయోజనం లేని సినిమాల్లో హీరోగా నటిస్తూ వెళితే ఉన్న కాస్త ఇమేజ్ కూడా పోతుంది. అలాగే ఏదైనా పెద్ద సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించే ఛాన్సూ మిస్ అవుతుంది.

ఇంకా చెబితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, విలన్ పాత్రలకూ చాలా ప్రాధాన్య ఉంటుంది. ఈ వైపు పూర్తిగాటర్న్ తీసుకుంటే సత్యదేవ్ కు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో అవకాశాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎటూ పూరీ లాంటి వారి అండ ఉంది. అతను చెబితే తీసుకునే దర్శకులే కాదు.. ఎవరూ చెప్పకుండానే కొన్ని పాత్రలకు తనే పర్ఫెక్ట్ అనిపించే కథలూ వస్తున్నాయి. సో.. సత్యదేవ్ ఇలా ”హీరో వేశాలు” వేస్తూ టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే ఇతర పాత్రలతో నిత్యం బిజీగా ఉండటం బెటర్ అనేది చాలామంది భావన. ఏదేమైనా హీరోగా అతను పనికిరాడేమో అనుకునేవారికి గాడ్సే మరో ఎగ్జాంపుల్ గా నిలిచింది.అయితే ఇతని విషయంలో కథలు బాలేకపోతే అతనేం చేస్తాడూ అని వెనకేసుకువచ్చేవారూ ఉంటే వారికీ ఓ మాట చెప్పొచ్చు.. ఆ కథలు ఎంచుకుంటున్నది అతనే కదా..? అంటే స్టోరీ జడ్జిమెంట్ లేదు అని తెలిసిపోతుంది కదా..? అలాంటప్పుడు ఎందుకు పెద్ద బాధ్యతలు భుజాన వేసుకుని ఆ సినిమాలను మోయడం.. ఏదైనా పెద్ద సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తే సినిమా ఎలా ఉన్నా తన పాత్రకు వచ్చే గుర్తింపు మారదు కదా.. నిజానికి ఇతనికంటే టాలెంటెడ్ అనిపించుకున్న నవీన్ చంద్ర కూడా ఇదే భ్రమల్లో కొన్నాళ్లు ఉన్నాడు. బట్ చాలా త్వరగానే రియలైజ్ అయ్యి ఇప్పుడు ఏ పాత్రైనా చేస్తూ.. తన ఉనికి సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా బలంగా నిలుపుకుంటున్నాడు. సత్యదేవ్ కూడా ఆ దిశగా ఆలోచిస్తే తప్పేం ఉంది..

Advertisement