ఎన్టీఆర్ ..వెట్రిమారన్.. అసలు నిజం ఏంటీ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతకు ముందు హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడి వారిని ఆకట్టుకున్నా.. ఈచిత్రంలోని తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. దీంతో అతని నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ప్యాన్ ఇండియన్ లెవెల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ ను పెంచుతూనే రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. మొదటగా కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత మోస్ట్ వయొలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఉంటుంది. ఈ రెండు సినిమాలూ ప్యాన్ ఇండియన్ మూవీస్ గానే రాబోతున్నాయి. తర్వాత బుచ్చిబాబు అంటున్నారు కానీ అది అయ్యే పనిలా లేదు అనేదే ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. ఈలోగానే తెలుగులో చాలామంది ఓ కొత్త వార్తను క్రియేట్ చేశారు. ప్రశాంత్ నీల్ కంటే ముందే ఎన్టీఆర్ మోస్ట్ టాలెంటెడ్ తమిళ్ డైరెక్టర్.. రా అండ్ రస్టిక్ మూవీస్ తో కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్స్ తీసే వెట్రిమారన్ తో సినిమా చేయబోతున్నాడు అని. కానీ అందులో నిజమెంత అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజం సంగతి పక్కన బెడితే అసలు ఈ రూమర్ ఎందుకు వచ్చింది అనేదానికి ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది.

కొన్నాళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తిరుగుతున్నాడు ఎన్టీఆర్. ఆ టైమ్ లో తెలుగులోనే కొందరు ఎన్టీఆర్ కు ఏ దర్శకుడితో పనిచేయాలని ఉంది అని అడిగారు. దానికి అతను వెట్రిమారన్ డైరెక్షన్ లో నటించాలని ఉంది క్యాజువల్ గా అన్నాడు. అతని డైరెక్షన్ అంటే ఇష్టమని కూడా చెప్పాడు. ఈ మాటను పట్టుకునే ఇప్పుడు ఇన్ని వార్తలు వండుతున్నారు. నిజానికి వెట్రిమారన్ కథలు ఎక్కువగా డౌన్ ట్రాడన్ పీపుల్ నేపథ్యంలో ఉంటాయి. అలాంటి కథను ఎన్టీఆర్ చేస్తాడా అనేది పెద్ద డౌట్ అయితే చేసినా అది ఇప్పుడప్పుడే ఉండదు అనేదానికి ఆల్రెడీ ఉన్న రెండు సినిమాలు ఓ ఎగ్జాంపుల్.ఇలాంటి ప్రమోషన్స్ లో ఫలానా దర్శకుడితో పనిచేయాలని లేదా హీరోతో చేయాలని ఆయా హీరోలు, హీరోయిన్లు చెప్పడం కామన్. అంతదానికే ఆలూ చూలూ లేకుండా సినిమా చేస్తున్నారు అని రూమర్స్ అల్లేయడం ఎంత వరకూ కరెక్టో. అయితే ఎన్టీఆర్ – వెట్రిమారన్ కాంబినేషన్ లో సినిమా అంటూ వస్తే మాత్రం అది ఖచ్చితంగా ఎన్టీవోడి నట విశ్వరూపానికి తార్కాణం అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related Posts