Ram pothineni : స్టేటూ గేటు దాటినా రామ్

రామ్ పోతినేని .. ఈ సోమవారం తన బర్త్ డే ఈ సందర్బంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. మామూలుగానే ఈ కాంబో టాలీవుడ్ కు కొత్తగా ఉంది. రామ్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. అటు బోయపాటి అంటే ఊరమాస్ మూవీస్ తోనే కెరీర్ అంత కొనసాగిస్తున్నాడు. అందువల్లే వీరి కలయికలో కొత్త సినిమా అనౌన్స్ కాగానే చాలామంది ఆసక్తిగా చూసారు. ఇక ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తో ఇది పూర్తిగా బోయపాటి మార్క్ మూవీ నే అని అర్థమైంది.

ఇక రామ్ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ థండర్ వస్తుందని ముందే అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే ఈ థండర్ వచ్చేసింది.రామ్ చేతిలో ఎప్పుడూ ఒక దున్నపోతు కనిపిస్తోంది. ఈ థండర్ మొత్తమ్ యాక్షన్ మోడ్ లోనే ఉంది.
“నీ స్టేట్ దాటలేను అన్నావ్ .. దాటాను..నీ గేట్ దాటలేను అన్నావ్ .. నీ పవర్ దాటలేను అన్నావ్ దాటాను..ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్ ” అంటూ రామ్ చెప్పిన డైలాగు అదిరిపోయింది.

ఇది హీరో పాత్రను సూచిస్తోంది. ఎవడైనా తనకు అడ్డు చెబితే వాడి అంతు చూసేవరకు అతను ఆగడు అనేది అర్థమవుతోంది. ఈ పాత్ర కోసం రామ్ బాడీ చాలా వరకు మార్చుకున్నాడు. బోయపాటి మూవీ అంటే హీరో ఫిజిక్ ఎలా ఉండాలో అలా పెంచాడు. బాగా లావుగా కనిపిస్తున్నాడు.రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రం లో.


అయితే ఈ థండర్ లో ది బెస్ట్ అనిపించింది థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఆర్ ఆర్ ఓ రేంజ్ లో ఉండనే చెప్పాలి. అఖండ తర్వాత బోయపాటితో థమన్ చేస్తోన్న మూవీ ఇది.

చూస్తుంటే ఈ మూవీ కి థమన్ మరోసారి బిగ్ ఎస్సెట్ కాబోతున్నట్టుగా ఉంది. మొత్తముగా రామ్ బర్త్ డే రోజు ఫాన్స్ కు సాలిడ్ థండర్ ఇచ్చాడు అనుకోవచ్చు.

Telugu 70mm

Recent Posts

‘Gangs of Godavari’ Teaser.. Vishwak Sen Oora Mass Avatar..!

Vishwak Sen, who had a decent hit with 'Gaami', is now coming to the audience…

6 hours ago

Mahesh – Vijay Multistarrer Set This Time?

Tollywood superstar Mahesh Babu and Tamil actor Vijay have a good relationship. Mahesh Babu will…

7 hours ago

జూన్ 27న ‘కల్కి‘.. కొత్త పోస్టర్ తో క్లారిటీ

రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఎ.డి' సినిమా కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే…

8 hours ago

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ టీజర్.. విశ్వక్ సేన్ ఊర మాస్ అవతార్..!

‘గామి‘తో డీసెంట్ హిట్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రంతో ప్రేక్షకుల…

9 hours ago

కృష్ణ పుట్టినరోజున సుధీర్ బాబు ‘హరోం హర‘

సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఇప్పటివరకూ సుధీర్ బాబు చేయనటువంటి వైవిధ్యభరిత పాత్రతో ఈ సినిమా రాబోతుంది.…

9 hours ago

‘రామం రాఘవం‘ టీజర్.. కొత్త పంథాలో తండ్రీకొడుకుల అనుబంధం

కమెయడిన్ ధనరాజ్ డైరెక్టర్ గానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం 'రామం రాఘవం'. తండ్రీకొడుకుల…

10 hours ago