విజయ్ ఇన్ సెక్యూర్ ఫీలవుతున్నాడా?

విజయ్ దేవరకొండ.. ఓవర్ నైట్ ఫేమ్ వచ్చిన స్టార్. రెండు మూడు సినిమాలకే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఓవర్ యాటిట్యూడ్, కేర్ లెస్ నెస్, రౌడీ బాయ్ ఇమేజ్ ఇవన్నీ కలిసి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చాయి. ఆ క్రేజ్ రీసెంట్ గా డ్యామేజ్ జరిగింది. వరుసగా సినిమాలు పోయాయి. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అతని క్రేజ్ మినిమం కూడా ఈ చిత్రాలకు ఉపయోగపడలేదు. దీంతో అనివార్యంగా పూరీ జగన్నాథ్ క్యాంప్ లోకి ఎంటర్ అయ్యాడు. అంతకు ముందు అర్జున్ రెడ్డి, గీత గోవిదం టైమ్ లో పూరీయే స్వయంగా విజయ్ తో సినిమా చేయాలనుకున్నాడనీ.. పూరీకి విజయ్ నో చెప్పాడనే వార్తలు అప్పట్లో వచ్చాయి. కట్ చేస్తే మూడు ఫ్లాపులు రాగానే ఇతనే అతన్ని వెదుక్కుంటూ వెళ్లాడు. అందుకు కారణం లేకపోలేదు. విజయ్ నో చెప్పిన టైమ్ లో పూరీ డిజాస్టర్స్ లో ఉన్నాడు. ఇతనికి డిజాస్టర్స్ వచ్చిన టైమ్ లో పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హిట్ అందుకున్నాడు. అందుకే వెళ్లాడా లేక కాంబినేషన్ సెట్ అయిందా అనేది చెప్పలేం కానీ.. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో లైగర్ అనే సినిమా వస్తోంది. సాలా క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ తో ఆకట్టుకుంటోన్న ఈ మూవీ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ప్యాన్ ఇండియన్ సినిమాగా వస్తోన్న లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ మరోసారి ఎప్పట్లానే అతి చేస్తూ ఈ సారి ఓ డైలాగ్ కొట్టాడు.”మా తాత ఎవరో.. తండ్రి ఎవరో తెలియకుండానే నాకు ఫ్యాన్స్ అయ్యారు మీరు” అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ అన్నాడు.

అంటే ఇప్పటి వరకూ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్స్ అంతా కేవలం వారి తాతలు, తండ్రుల మూలంగానే అభిమానులను సంపాదించుకున్నారు అనే ఇన్ డైరెక్ట్ అర్థం వచ్చేలా ఈ కమెంట్స్ చేశాడని ఎవరికైనా అర్థం అవుతుంది. ఇక విజయ్ కమెంట్స్ పై ఇతర హీరోల అభిమానులు విరుచుకు పడుతున్నారు. లేటెస్ట్ గా బండ్ల గణేష్ కూడా తాతలు, తండ్రులు కాదు.. ఎంతో టాలెంట్ కూడా ఉంటేనే రాణిస్తారు అంటూ విజయ్ కౌంటర్ గా ఓ ట్వీట్ చేశాడు. ఇదంతా ఓ ఎత్తైతే.. అసలు విజయ్ ఈ కమెంట్స్ చేయడం వెనక రీజన్ ఏంటా అని చాలామంది ఆలోచిస్తున్నారు.నిజానికి విజయ్ దేవరకొండను తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ ఎవరికీ లేదు. అతని రూట్ లో అతను ఉన్నాడు. షార్ట్ టైమ్ లో ఫేమ్ వచ్చింది. దాన్ని ఎంజాయ్ చేస్తూ అంతే షార్ట్ టైమ్ లో ప్యాన్ ఇండియన్ మూవీ వరకూ వెళ్లాడు. దీనికీ తాతలకూ సంబంధం ఏంటీ..? ఒకవేళ ఉందీ అనుకుంటే.. అలా ఉన్న అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్‌ బాబు లాంటి వారికి ఇంత త్వరగా ప్యాన్ ఇండియన్ మూవీ రాలేదు కదా.. ? అయినా అనువుకాని సమయంలో ఈ అర్థం లేని వ్యాఖ్యలు అవసరమా అంటూ ఇప్పటి వరకూ విజయ్ ని అభిమానించిన వారు కూడా ఫీల్ అవుతున్నారు.మరోవైపు విజయ్ దేవరకొండ చాలా ఇన్ సెక్యూర్ గా ఉన్నాడనీ..

ఆ కారణంగానే ఇలాంటి కమెంట్స్ చేస్తున్నాడనీ అంటున్నారు. పైగా లైగర్ సినిమా విషయంలో ముందు నుంచీ ఈ టీమ్ చాలా అతి చేస్తోందనే భావనలోనూ చాలామంది ఉన్నారు. ఇందులో సినిమా పరిశ్రమ వాళ్లూ ఉన్నారు. ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ లో వారు చేసిన హడావిడీ చూసి పెద్ద హీరోల ఫ్యాన్స్ కూడా ముక్కున వేలేసుకున్నారు. అవసరమా ఇంత అతి అని అంతా అనుకుంటున్నారు. అలాంటి టైమ్ లో ఈ కామెంట్స్ విజయ్ కి మైనస్ అవుతాయో తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదు. ఒకవేళ విజయ్ చెప్పిందే నిజమైతే.. బాలీవుడ్ లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటీ.. అక్కడ నెపోటిజం కిడ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదా..? టాలెంట్ లేకపోతే ఎవరినైనా వెనక్కినెట్టేస్తారు ఆడియన్స్ అనే మినిమం సెన్స్ విజయ్ కి లేదా అనుకోవచ్చు.నటుడుగా విజయ్ దేవరకొండలో టాలెంట్ ఉంది. మరి ఎన్టీఆర్ లా డైలాగులు, అల్లు అర్జున్ లా డ్యాన్సులు, పవన్ కళ్యాణ్ లా పవర్ ప్యాకింగ్ టైమింగ్, రామ్ చరణ్ లాంటి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. షార్ట్ టైమ్ లో వచ్చిన ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడితే అతని కెరీర్ లాంగివిటీ ఉండదు. పైగా మైనస్ అవుతుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు.మరో విశేషం ఏంటంటే.. విజయ్ దేవరకొండని ఇండస్ట్రీలో ఎవరూ తొక్కేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఓ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇంకా చెబితే చాలామంది స్టార్స్ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అందులో అల్లు అర్జున్ లాంటి వారు కూడా ఉన్నారు. అయినా ఇలా ఓవరాక్షన్ చేయడం అంటే గాలికి పోయే డ్యాష్ ను వీపుకు కొట్టుకున్నట్టే కదా..

Related Posts