రామ్ చరణ్‌ లాంటి టాప్ స్టార్ తో సినిమా..

రామ్ చరణ్‌ లాంటి టాప్ స్టార్ తో సినిమా చేస్తూ .. మరో మూవీకీ వర్క్ చేయడం అంత సులభం కాదు. కానీ చేస్తాను అంటున్నాడీ దర్శకుడు. అనడమే కాదు.. అందుకు తగ్గ ప్లానింగ్ కూడా చేసుకున్నాడు. ఇటు చరణ్ తో పాటు అతని నిర్మాతను కూడా ఒప్పించాడు. అందుకు కారణం కూడా ఉంది. అతను ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్ అది. ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ఒకసారి కోర్ట్ గొడవా అయింది. అందుకే ఈ తలనొప్పులు ఎందుకు అనుకున్నాడేమో.. ఒకేసారి రెండు సెట్స్ లో యాక్షన్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు.ఒక భారీ సినిమా చేస్తూ మరో బిగ్ ప్రాజెక్ట్ డీల్ చేయడం అంత సులభం కాదు. ఎంత ప్లాన్ చేసుకున్నా అది రెండు సినిమాలపై ప్రభావం చూపిస్తుంది. అయినా సరే కమిట్మెంట్ కు కట్టుబడి ఉండేందుకే సిద్ధమయ్యాడు ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన శంకర్. మామూలుగా శంకర్ భారతీయుడుకు సీక్వెల్ తీయాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ మొదలై మొదటి షెడ్యూల్ కు కూడా వెళ్లింది. కానీ రకరకాల కారణాలతో ఆగిపోయింది. ఓ దశలో కోర్ట్ మెట్ల వరకూ వెళ్లింది. ఈ లోగా కమల్ హాసన్ విక్రమ్ మూవీ చేశాడు.. భారీ హిట్ కొట్టాడు.

ఆ క్రేజ్ తనకూ కలిసొస్తుందనుకున్నాడో లేక నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడో కానీ.. శంకర్.. రామ్ చరణ్ తో పాటు భారతీయుడు 2ను కూడా ఒకేసారి చిత్రీకరించాలనుకుంటున్నాడు.దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా శంకర్ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడిప్పుడు. చరణ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వచ్చే యేడాది సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఓ వైపు ఈ మూవీ షూటింగ్ లో ఉండగానే లేటెస్ట్ గా శంకర్ భారతీయుడు2ను తెరపైకి తెచ్చాడు. చరణ్ సినిమాతో పాటు ఆ చిత్రాన్ని కూడా షూట్ చేయాలనుకుంటున్నాడు. ఇందుకోసం చరణ్ మూవీకి 10 రోజులు, కమల్ మూవీకి 10 రోజులు కేటాయించుకున్నాడట. కమల్ కోసం దిల్ రాజు, చరణ్‌ లను ఒప్పించాడట. పైగా ఈ రెండు సినిమాలకూ స్క్రిప్ట్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వరకూ ఆల్రెడీ అయిపోయి ఉంది కాబట్టి పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే భారతీయుడు2 కు కాజల్ అందుబాటులో లేదు కాబట్టి ఇక మరో హీరోయిన్ కోసం వెదుక్కోవాలి. ఏదేమైనా ఒకేసారి రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ను డీల్ చేయడం మాత్రం కత్తిమీద సాములాంటిదే. మరి ఈ టాస్క్ ను శంకర్ ఎలా ఛేదిస్తాడో చూడాలి.

Related Posts