మీనా భర్త ఎందుకు చనిపోయాడో తెలుసా..?

మీనా భర్త ఎలా చనిపోయాడో తెలుసా..?.. ఒకప్పటి సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న ఎన్నో పాత్రల్లో ఆకట్టుకుంది. పైగా తను బాల నటిగానే సౌత్ ఆడియన్స్ కు బాగా రిజిస్టర్ అయింది. బాల నటిగా చేసి తర్వాత హీరోయిన్లుగా మారిన వారిలో మీనా టాప్ ప్లేస్ సంపాదించుకుందనే చెప్పాలి. సౌత్ లోని అందరు టాప్ స్టార్స్ తో యాక్ట్ చేసిన మీనా.. వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం మొదటి నుంచీ లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తూ వచ్చింది. ఆమె తరం హీరోయిన్లలాగా మీనా విషయంలో ఎప్పుడూ గాసిప్స్, రూమర్స్ వినిపించలేదు. అన్ని భాషల్లో అందరు హీరోలతోనూ మంచి రిలేషన్స్ మెయిన్టేన్ చేసిన మీనా.. ఆ టైమ్ లో కోట్లమంది ప్రేక్షకుల కలల రాణి. అలాంటి తనను పెళ్లి చేసుకోవాలని ఇండస్ట్రీలోనే చాలామంది ప్రయత్నించారు. ఎంతోమంది ప్రేమించారు. కానీ తను మాత్రం పూర్తిగా తన పెళ్లి విషయాన్ని కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే వారు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. అతనే ఇప్పుడు చనిపోయిన విద్యా సాగర్.


విద్యా సాగర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. సంప్రదాయ కుటుంబానికి చెందిన మీనా పెళ్లి కూడా అలాగే పద్ధతిగా జరిగింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీనా కూతురు పుట్టి తను కాస్త పెద్ద అయిన తర్వాత మళ్లీ నటించడం మొదలుపెట్టింది. అటు కూతురును నైనిక ను కూడా తనలాగే బాలనటిగా పరిచయం చేసింది. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన తెరి(తెలుగులో పోలీసోడు)లో నటించిన పాప మీనా కూతురే. ఓ రకంగా మీనాది ఆదర్శ దాంపత్యంగానే చెబుతారు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలాంటి వీరి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునగడానికి కారణం రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా. కరోనా సెకండ్ వేవ్ లో మీనా కుంటుంబం అంతా కరోనా బారిన పడింది. అప్పట్లో ఆమె భర్త కాస్త ఎక్కువ సిమ్టోమ్స్ తో ఇబ్బంది పడ్డారు. బట్ కోలుకుని మళ్లీ ఇంటికి వచ్చారు. కానీ పోస్ట్ కోవిడ్ ఇష్యూస్ తో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి. అదే అతన్ని కబళించింది.


కరోనా ప్రభావం అంతా ఊపిరితిత్తులోనే కనిపిస్తుంది. దాని బారి నుంచి కోలుకున్నా.. కరోనా కాటు కాస్త ఆలస్యంగా అతని లంగ్స్ పై ఎఫెక్ట్ చూపిస్తూ వచ్చింది. దీంతో కొన్నాళ్లుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాడు. ఓ రకంగా ఇది సివియర్ గానే ఉందని చెబుతారు. కానీ లంగ్స్ ను రీప్లేస్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ సకాలంలో డొనేటర్స్ దొరక్క.. చివరికి ఆయన మరణానికి కారణమైంది. ఓ రకంగా విద్యా సాగర్ మరణయాతన అనుభవించారు. ఆ యాతన కుటుంబం అంతా అనుభవించిందనే చెప్పాలి. ఖచ్చితంగా చెబితే.. అతను ఎప్పుడైనా చనిపోవచ్చు అన్న విషయం ఆ కుటుంబం మొత్తానికీ తెలుసు. ఇంతకు మించిన శిక్ష ఇంకేం ఉంటుంది. కానీ చివరి వరకూ ఎవరైనా ఊపిరితిత్తులను దానం చేస్తారేమో అని ఎదురు చూశారు. ఎవరూ ముందుకు రాలేదు. ఈ కారణంగానే మీనా భర్త విద్యా సాగర్ కేవలం 48యేళ్ల వయసులోనే శాశ్వతంగా కన్నుమూశారు.

Related Posts