రంగా లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ .. అన్నట్టుగా ఉంటే ఇప్పుడు జనాలు పట్టించుకోవడం లేదు. ఆ లవ్ స్టోరీలో ఏదైనా కొత్తదనం ఉందా అనేది చెప్పాల్సిందే. ఆ విషయం టైటిల్ నుంచి మొదలుపెడితే ఫస్ట్ ఇంప్రెషన్ వేసే టీజర్ వరకూ అప్లై అవుతుంది. ఇంకా చెబితే టీజర్ తోనే అంచనాలు పెంచగలరు. ఆ విషయం వదిలేసి ఏదో ఒక ప్రేమకథ చెప్పబోతున్నాం అనిపించేలా ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఆ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా ప్రూవ్ అయింది. అయినా మరోసారి అదే మిస్టేక్ చేసినట్టుగా కనిపిస్తోంది రంగరంగ వైభవంగా మూవీ టీజర్.ఉప్పెనతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. తెలుగులో పాథ్ బ్రేకింగ్ మూవీ అనిపించుకున్న అర్జున్ రెడ్డికి కో డైరెక్టర్ గా పనిచేసి.. అదే చిత్రాన్ని తమిళ్ లో డైరెక్ట్ చేసి విజయం అందుకున్న గిరీశయ్య డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం ఈ రంగ రంగ వైభవంగా. మరోవైపు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలం కొండెక్కి ఉంది. ఆ డిజాస్టర్ నుంచి బయటకు రావాలంటే ఓ మంచి ప్రేమకథ చెప్పడంలో తప్పేం లేదు.

కానీ ఆ కథ ఆరంభం నుంచే ఆకట్టుకునేలా ఉండాలి. బట్ ఈ టీజర్ చూస్తే ఇందులో పెద్ద కొత్తదనం ఏ కనిపించడం లేదు.ఎప్పుడూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ అందరి దృష్టిలో శతృవుల్లా కనిపిస్తూ వారి మనసుల్లో మాత్రం ప్రేమను పెంచుకున్న కపుల్ కథలు చాలానే వచ్చాయి ఇప్పటి వరకూ ఈ టీజర్ చూస్తే ఆ మూవీ అందుకు భిన్నంగా ఏం కనిపించడం లేదు. ప్రేమకథల్లో మరీ కొత్తదనం ఏం కనిపించదు. కానీ వారి మధ్య కాన్ ఫ్లిక్ట్, నేపథ్యం, కథనం.. ఈ మూడు విషయాల్లో ఎన్ని రకాలుగా అయినా కొత్తదనం చూపించొచ్చు. బట్ ఈ టీజర్ చూస్తే అలాంటిదేం కనిపించడం లేదు. పైగా టీజర్ ఆసాంతం నీరసగానే కనిపించింది. మరి సినిమా కూడా ఇలాగే ఉంటుందా లేక కాస్త జోష్‌గా ఉంటుందా అని చెప్పలే కానీ.. రంగ రంగ వైభవంగా మాత్రం ఈ టీజర్ లేదు రంగా..

, , , , , ,