మూడు పెళ్లిల్లు చేసుకున్న నేటి తరం బామ్మ ఎవరో తెలుసా..?

కొందరు నటులు అరుదుగా ఉంటారు. నటనలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ఇతరులకు భిన్నంగా ఉంటారు. అలాంటి భిన్నమైనవారిలో లక్ష్మి ఒకరు. ఈమె పేరు తరానికో ఇమేజ్ తో ముడిపడి ఉంటుంది. నేటి తరానికి బామ్మ. నిన్నటి తరానికి అమ్మ.. మొన్నటి తరానికి పంతులమ్మ.. అటు మొన్నటికి జూలీ.. ఒక నటి కెరీర్ లో ఇన్ని వైవిధ్యాలుండటం వెరీ రేర్. అలాంటి రేరెస్ట్ కెరీర్ ను సెట్ చేసుకున్న లక్ష్మి వెరీ డేర్ కూడా.. ఏం చేసినా ధైర్యంగా చేయడం ఆమె నైజం. అదే దక్షిణాదిలోనే కాక హిందీ చిత్రసీమలో కూడా లక్ష్మికి ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చింది. ఆమె ఫ్యామిలీ అంతా సినిమా పరిశ్రమలోనే ఉండటంతో చిన్నతనం నుంచే ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. బాల నటిగానే కెరీర్ మొదలుపెట్టింది. ఆ కాలంలో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లు చేయడానికి చాలా భయపడిన ఎన్నో బోల్డ్ రోల్స్ లో సులువుగా నటించింది లక్ష్మి. మళయాలంలో నటించిన జూలీ అనే చిత్రంలో ఏకంగా బికినీ వేసి సంచలనం సృష్టించింది. ఇదే సినిమా హిందీలో అదే పేరుతో రీమేక్ అయి అక్కడా సూపర్ హిట్ అయింది. అందుకు ప్రధాన కారణం లక్ష్మి అందాలే అని నాటి తరం ప్రేక్షకులు నేటికీ చెప్పుకుంటారు. హీరోయిన్ గా ఎక్కువ శాతం కన్నడ, తమిళ్, మళయాలంలో నటించి టాప్ హీరోయిన్ అనిపించుకున్న ఆమె తెలుగులో మాత్రం ఆ రేంజ్ గుర్తింపు తెచ్చుకోలేకపోయిందనే చెప్పాలి.
కెరీర్ పరంగా ఇప్పటి ప్రేక్షకులకు ఓ మంచి బామ్మగానే తెలిసిన లక్ష్మి వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదు. ఆమె మొదటగా 1969లో భాస్కర్ అనే ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఐశ్వర్య అనే కూతురు పుట్టింది. తను కూడా నటే. తెలుగులో చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈటివిలో వస్తోన్న అలీతో సరదాగా షోకు ఈ వారం గెస్ట్ తనే. ఐశ్వర్య పుట్టిన తర్వాత వీరు 1974లో విడిపోయారు.
మళ్లీ 1975లో మోహన్ శర్మ అనే నటుడుని పెళ్లి చేసుకుంది. ఇతను తెలుగువారికీ సుపరిచితుడే. సాగర సంగమం చిత్రంలో జయప్రద భర్త పాత్రలో నటించాడు. అలా ఎక్కువమందికి గుర్తుంటాడీయన. బట్ మోహన్ శర్మతోనూ లక్ష్మీ జీవితం సాఫీగా సాగలేదు. దీంతో వీరు 1980లో విడిపోయారు. వీరికి పిల్లలు లేరు.
మోహన్ శర్మతో విడిపోయిన తర్వాత శివచంద్రన్ అనే తమిళ్ సినిమా వ్యక్తిని 1987లో పెళ్లాడారు. అతను నటుడు, దర్శకుడు, రచయిత, ఎడిటర్ కూడా. మొత్తంగా మూడో పెళ్లితో లక్ష్మి లైఫ్ సెటిల్ అయింది. కాకపోతే వీరికీ సంతానం కలగలేదు. దీంతో 2000 సంవత్సరంలో సంయుక్త అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
విశేషం ఏంటంటే.. తనకు పుట్టిన ఐశ్వర్యను లక్ష్మి పట్టించుకోలేదు. ఇప్పటికీ వీరి మధ్య పెద్దగా సంబంధాలు లేవు. ఏదేమైనా ఆ కాలంలోనే ఇన్ని పెళ్లిల్లు చేసుకున్న నటిగా లక్ష్మి రికార్డ్ సృష్టించింది.

Related Posts