“ఆర్ఆర్ఆర్” గురించి స‌ల్మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం పై ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ భారీ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డివివి దాన‌య్య అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబాయిలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో చాలా గ్రాండ్ గా నిర్వ‌హించారు.

ఈ వేడుకలో బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ ఫంక్ష‌న్ లో జిలుగుల వెలుగుల‌ కాంతిలో క్రేన్‌ తో అమ‌ర్చిన స్పెష‌ల్ వెహికిల్ లో స‌ల్మాన్ ఎంట్రీ ఇవ్వడం జ‌రిగింది. అదిరింది అనేలా ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా చేశారు. ఇక స్టేజ్‌ పై సల్మాన్ ఖాన్ ఆర్ఆర్ఆర్ చిత్రబృందం పై ప్ర‌శంస‌ల‌ వర్షం కురిపించాడు. ఇంత‌కీ సల్మాన్ ఖాన్ ఏమ‌న్నారంటే.. ఎన్టీఆర్ న‌ట‌న‌ను నేను ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే రామ్ చ‌ర‌ణ్‌ లా హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌ ను నేను చూడ‌లేదు. ఆర్ఆర్ఆర్ కోసం ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన మరో నాలుగు నెలల వరకు ఏ సినిమా రిలీజ్ కాకుండా ఉంటే బాగుంటుంది అని సల్మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఆర్ఆర్ఆర్ గురించి స‌ల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.