సౌత్ లో విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీస్ ఎందరో తెలుసా..?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమల్లో విడాకులు అనే మాట మోత మోగిపోతోంది. రీసెంట్ గా నాగచైతన్య, సమంతల విడాకులు దేశవ్యాప్తంగా

సంచలనం అయింది. అందుకు కారణాలేంటనేది ఎవరికి తోచింది వారు అనుకున్నారు. ఏదైతేనేం ఆ ఇద్దరూ విడిపోవడం చాలామందికి షాక్ కు గురి

చేసింది. ఇక లేటెస్ట్ గా ధనుష్, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకులు సైతం విస్మయపరిచింది. వీరి విషయంలో ఇది చివరి నిమిషం వరకూ

అస్సలెవరూ ఊహించలేదు. మూడు నెలల క్రితం కూడా బానే ఉన్నారు. అలాంటిది సడెన్ గా డివోర్స్ అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే

అసలు ఈ ట్రెండ్ సౌత్ లో ఎప్పుడు మొదలైంది అంటే ఖచ్చితంగా వీరే మొదలు అనలేం కానీ.. మన దగ్గర కూడా చాలామంది స్టార్స్ డివోర్స్ తో

ఆశ్చర్యపరిచారు. అలాంటి వారిలో మొదటగా చెప్పాల్సింది కమల్ హాసన్ నే చెప్పాలి. ఈ విషయంలో ఆయన రెండు సార్లు అఫీషియల్ గా ఒకసారి

అనఫీషియల్ గా విడాకులు తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశాడు. రెండో భార్య సారిక ద్వారానే ఆయనకు శ్రుతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు.
కమల్ తర్వాత కాస్త ఎక్కువమందిని ఆకర్షించిన విడాకులు నాగార్జునదే. రామానాయుడు కూతురును పెళ్లి చేసుకున్నాడు నాగ్. వీరికే నాగచైతన్య

జన్మించాడు. తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చిన నాగార్జున నటి అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరి తనయుడే అఖిల్.
వీరికంటే ముందు పార్తీబన్ – సీతల విడాకులు కూడా హాట్ టాపిక్ అయిందప్పట్లో. మళయాల నటుడు ప్రతాప్ పోతన్ ను పెళ్లి చేసుకున్న రాధిక కూడా

అతనితో విడాకులు తీసుకుంది. రాధికకు అంతకు ముందే పెళ్లైంది. ప్రతాప్ తర్వాత నటుడు శరత్ కుమార్ ను పెళ్లాడింది. లేట్ ఎయిటీస్ లో మోస్ట్

బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనిపించుకున్న రేవతి సైతం మళయాల సినిమాటోగ్రాఫర్ సురేష్ చంద్ర మీనన్ ను పెళ్లి చేసుకుని కొన్నాళ్ల తర్వాత

విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తను సింగిలే. అలాగే ఎయిటీస్ లో స్పెషల్ సాంగ్స్, స్పెషల్ మూవీస్ తో ఆకట్టుకున్న నళిని కూడా రామరాజు అనే తమిళ నటుడుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు విడిపోయారు. హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి సైతం 1994లో పెళ్లి చేసుకున్న గాయత్రికి 2010లో విడాకులు ఇచ్చి 2013లో మరో వివాహం చేసుకున్నాడు.
ఇక ఆ తరం తర్వాత విడాకుల వ్యవహారంలో ఎక్కువమంది చర్చించుకున్న ఈ కాలపు జంట అమలా పాల్, విజయ్. విజయ్ దర్శకుడు. అమల నటిగా ఆయనతోనే మొదటి విజయాలు అందుకుంది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. బట్ చాలా తక్కువ టైమ్ లోనే విభేదాలు వచ్చాయి. అమల సినిమాలు చేయాలనుకుంది. విజయ్ కుటుంబం నో చెప్పింది. దీనికి తోడు అమలకు ధనుష్ తో ఎఫైర్ ఉందన్న వార్త కూడా వీరి విడాకులుకు కారణం అనే రూమర్స్ వచ్చాయి అప్పట్లో.
అటుపై సౌత్ మొత్తం సంచలనం అయిన మరో విడాకులు పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్. పవన్ అంతకు ముందే నందిని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. విడాకులు కాకుండానే రేణును పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నందనితో విడాకులు అయింది. రేణుతో రిలేషన్ లో ఉంటూనే మరో రష్యన్ లేడీతో పవన్ క్లోజ్ గా ఉన్నాడు. ఇది తెలిసిన రేణూ నిలదీయడంతో విడాకులు తప్పలేదు. ప్రస్తుతం రేణు ఒంటరిగా ఉంటుంటే.. పవన్ మూడో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు.
సైలెంట్ గా డివోర్స్ అయిన మరో జంట మంచు మనోజ్ ది. అతని విషయంలో ఎలాంటి ఇష్యూస్ కనిపించలేదు. ఇక నాగచైతన్య, అమల తర్వాత ఇప్పుడు ధనుష్ ఐశ్వర్య విడాకులు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా కలిసి ఉండటం కుదరదు అనిపించినప్పుడు కాస్త టైమ్ తీసుకుని ఆలోచించుకోవాలి. అప్పుడు కూడా అదే భావన ఉంటే.. విడిపోవడమే ఉత్తమం అంటారు విశ్లేషకులు.

Related Posts