మహేష్‌ బాబు కెరీర్ లోనే ఇలాంటి ఫైట్ లేదట ..?

మాస్ హీరో సినిమా అంటే మాంచి ఫైట్స్ ఉండాల్సిందే కదా.. ఆ ఫైట్స్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. అయితే అన్ని ఫైట్లూ గుర్తుండవు. కొన్ని మాత్రమే భేలే కంపోజ్ చేశార్రా బాబూ అనుకుంటాం. అలాంటివి ఏ హీరోకైనా ప్రతి సినిమాలో ఓ ఫైట్ ఉండేలా చూసుకుంటారు. అలా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్‌ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలో ఓ బ్లాక్ బస్టర్ ఫైట్ ను పెట్టబోతున్నారట.


ఫైట్స్ లో మహేష్‌ బాబు బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూసుకుంటాడు. తను ఏ సినిమా చేసినా ఓ స్పెషల్ ఫైట్ కనిపిస్తుంది. శ్రీమంతుడులో మామిడితోట ఫైట్ సీన్ అదిరిపోతుంది. భరత్ అనేనేనులో థియేటర్ లో ఫైట్ సూపర్బ్ అనిపించుకుంది. మహర్షిలో సైతం ఇదే తరహాలో ఆకట్టుకున్నాడు. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రమణా లోడెత్తాలిరా అంటూ ఫారెస్ట్ లో చేసిన ఫైట్ రీసెంట్ టైమ్స్ లో మహేష్‌ చేసిన బెస్ట్ యాక్షన్ సీన్. రీసెంట్ గా వచ్చిన సర్కారువారి పాటలతోనూ తాళాల గుత్తి ఫైట్ ఆకట్టుకుంటుంది.


త్రివిక్రమ్ సినిమాల్లో పంచ్ డైలాగ్స్ ఎంత పేలతాయో.. ఫైట్ సీన్స్ కూడా అంతే బ్లాస్టింగ్ గా ఉంటాయి. అయితే క్లాస్.. లేదంటే మాస్ అంటూ మెస్మరైజ్ చేస్తాయి. అరవింద సమేత సినిమా ఓపెనింగ్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే అల వైకుంఠపురములో క్లైమాక్స్ ఫైట్ అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. అంటే ఫైట్స్ కూడా కథలో భాగంగా కనిపిస్తాయన్నమాట.

అలా ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మహేష్‌ బాబుతో చేస్తోన్న సినిమాలో ఓ అద్భుతమైన ఫైట్ ఉండబోతోంది. ఈ ఫైట్ సీన్ తోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుండటం విశేషం. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబోతోన్న ఈ ఫైట్ మహేష్‌ ఇప్పటి వరకూ చేసిన సినిమాల కంటే చాలా హై రేంజ్ లో ఉంటుందట. మరి మూవీకి ఈ ఫైట్ ఎంత హైప్ తెస్తుందో చూడాలి.

Related Posts