ఏ భాషలో అయినా.. పండగ సీజన్స్ లో ఆయా భాషల్లోని హీరోల సినిమాలు వస్తే చూడాలనుకుంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా పెద్ద పండగలైతే ఇంక చెప్పేదేముందీ.. స్టార్ హీరోల కటౌట్సే కట్టాలని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తారు. ఈ సారి దసరాకు చిరంజీవి, నాగార్జున వస్తున్నారు. వీరికంటే ముందే తమిళ్ సినిమాలు దసరా శెలవులను గ్రాబ్ చేయబోతున్నాయి. అయితే దసరా మాత్రమే కాదు.. దీపావళి సైతం కోలీవుడ్ హీరోలే కొల్లగొట్టబోతున్నారు. యస్.. దీపావళి బరిలో మనకంటే వాళ్లే ముందున్నారు. నిజానికి ఈ టైమ్ కు తెలుగు నుంచి చాలా సినిమాలు వస్తాయి అని భావించారు. బట్ వాళ్లెవరూ సౌండ్ చేయడం లేదు. దీంతో ఈ ఛాన్స్ ను కోలీవుడ్ హీరోలు కొల్లగొట్టేయబోతున్నారు.ఇప్పుడిప్పుడే తెలుగులోతనదైన మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు తమిళ్ హీరో శివకార్తికేయన్. మొదట్లో డిఫరెంట్ మూవీస్ తో తమిళ్ ఆడియన్స్ లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు స్టార్ హీరోగానే వెలుగుతున్నాడు.
అలాంటి తను చాలాకాలంగా తెలుగు మార్కెట్ లో అడుగుపెట్టాలనుకున్నా.. అది ఈ మధ్యే సాధ్యమవుతోంది. ఆ మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు ఫస్ట్ టైమ్ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా ప్రిన్స్. శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మారియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ప్రిన్స్ ను దీపావళి బరిలో దించుతున్నారు.ఇక ఫస్ట్ మూవీ నుంచే తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న హీరో కార్తి. దాదాపు తన ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నాడు. కానీ కార్తీ కూడా కొన్నాళ్లుగా మన ఆడియన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నాడు.
అందుకే రీసెంట్ గా వచ్చిన విరుమాన్ చిత్రాన్ని ఇక్కడ ఎవరూ రిలీజ్ కూడా చేయలేదు. బట్ మన ఆడియన్స్ టేస్ట్ కు దగ్గరగా ఉన్న చిత్రాలు మాత్రం వస్తాయి. అలాంటిదే ఇప్పుడు అతను నటించిన సర్దార్ మూవీ. పిఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్ గా వస్తోంది. రాశిఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని కూడా దీపావళికే విడుదల చేయబోతున్నారు. సో.. దీపావళి లాంటి పెద్ద పండగను సైతం మనవాళ్లు తమిళ్ హీరోలకే ఇచ్చేయబోతున్నారన్నమాట. మరి ఈ కోలీవుడ్ స్టార్స్ లోనూ ఎవరు బాక్సాఫీస్ ను గెలుస్తారో చూడాలి.
సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ…
నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుసినిమాటోగ్రఫి: ఎస్.చంద్రశేఖరన్సంగీతం:…
The combination Mahesh Babu - Rajamouli is eagerly awaited by movie lovers all over the…