“ఆర్ఆర్ఆర్” వ‌ద్దంటున్న డిస్ట్రిబ్యూట‌ర్స్.. టెన్ష‌న్ లో ప్రొడ్యూస‌ర్

ఆర్ఆర్ఆర్.. సినీ అభిమానులు అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురు చూసిన సినిమా ఇది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ పై ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ వ‌స్తుంది అనుకుంటే.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదా ప‌డిన ఆర్ఆర్ఆర్ మ‌రోసారి వాయిదా ప‌డ‌డంతో నిర్మాత‌ని బాగా ఇబ్బంది పెడుతుంది.

ఈ సినిమాని మ‌రోసారి వాయిదా వేయ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్స్ తీవ్ర‌ అసంతృప్తితో ఉన్నారు. అందుక‌నే నిర్మాత డివివి దాన‌య్య పై తీవ్ర‌మైన ఒత్తిడిని తీసుకొస్తున్న‌ట్టు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ ఉండ‌డంతో అన్ని ఏరియాల హ‌క్కులు హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోయాయి. సంవ‌త్స‌రం క్రిత‌మే డిస్ట్రిబ్యూట‌ర్స్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య‌కు డ‌బ్బులు ఇచ్చేశారు. అయిఏత‌.. ఈ సినిమా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్లో మూవీ కాబ‌ట్టి ఎప్పుడొచ్చినా లాభాలు సంపాదించొచ్చు అని బ‌య్య‌ర్లు ధీమాగా ఉండేవారు కానీ… వాయిదాల మీద వాయిదాలు ప‌డుతుండ‌డంతో వాళ్ల‌కీ చిరాకు వ‌చ్చింది. మాకు మీ సినిమా వ‌ద్దు.. మా డ‌బ్బులు వ‌డ్డీతో స‌హా తిరిగి ఇచ్చేయండి అని కొంత మంది నిర్మాత దాన‌య్య పై ఒత్తిడి తీసుకొస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చాలా ఎక్కువ రేటుకు సినిమాని కొన్నామ‌ని.. వ‌డ్డీలు క‌ట్ట‌లేక‌పోతున్నాం. సినిమా ఎప్పుడు వ‌చ్చినా మాకు లాభాలు రావు.. న‌ష్టాలే. అందుక‌నే సినిమాని వ‌దిలించుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. దీంతో దాన‌య్య రేటు తగ్గిస్తానంటున్నార‌ని టాక్. మ‌రి.. డిస్ట్రిబ్యూట‌ర్స్ ఓకే అంటారో..? లేదూ మా డ‌బ్బులు ఇచ్చేయండి అని ప‌ట్టుబ‌డ‌తారో చూడాలి.

Telugu 70mm

Recent Posts

Prabhas’s post left fans in suspense

Rebel star Prabhas entered social media very late. Moreover, updates from Prabhas are rare. An…

16 mins ago

Kajal in a pivotal role in the movie ‘Kannappa’.

Manchu Vishnu's star streak continues in the prestigious project 'Kannappa'. Till now, Vishnu, who has…

21 mins ago

Mahesh-Rajamouli Movie clarity on Casting Director

Director Rajamouli's upcoming movie 'SSMB 29' with superstar Mahesh Babu. Apart from Mahesh as the…

28 mins ago

Mamitha Baiju

47 mins ago

Closure of theaters did not come to our notice.. Telugu Film Producers Council

Low footfall due to elections and IPL has caused losses to theatres. This has affected…

55 mins ago