కెజీఎఫ్ తో యశ్ కు కొమ్ములొచ్చాయా..?

ఏ ఇండస్ట్రీలో అయినా టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, మినీ స్టార్స్ అనే కేటగిరీలు ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ ఉన్న ప్రతి చోటా కనిపిస్తుంది. వారి ప్లేస్, రేంజ్ ను బట్టే సినిమాలు వస్తుంటాయి. ఆడుతుంటాయి కూడా. ఇలా చూస్తే కన్నడలో కెజీఎఫ్ కంటే ముందు యశ్ ప్లేస్ మీడియం రేంజ్ హీరోల్లోనే ఉందనేది కాదనలేని సత్యం. ఇంకా చెబితే నాని లాంటి హీరోకు కాస్త మాస్ ఇమేజ్ కూడా తోడైతే ఎలా ఉంటుందో అలాంటి స్థానం యశ్ ది. కానీ అనుకోకుండా వచ్చిన కెజీఎఫ్ ఛాన్స్ అతన్ని అమాంతంగా దేశవ్యాప్తంగా పెద్ద స్టార్ ను చేసింది. అఫ్ కోర్స్ ఈ సినిమా కోసం మనోడు ఆరేళ్లకు పైగా టైమ్ కేటాయించాడు. ఈ ఆరేళ్లలో అయితే కన్నడలో కనీసం ఐదు సినిమాలు చేసేవాడు. బట్ ఇంతకాలం ఆగినందుకు ఆ ఐదు సినిమాలకు మించిన నేమ్, ఫేమ్, మనీ వచ్చి పడ్డాయి. అదనంగా ప్యాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ కూడా యాడ్ అయింది. ఇన్ని వచ్చాయని కాస్త అతిశయోక్తులకు పోయారో లేక.. నిజంగానే మనసులో ఉందో కానీ.. యశ్ వల్ల కన్నడ పరిశ్రమలోని ఇతర టాప్ లీగ్ లో ఉన్న హీరోల అభిమానులు ఓ చిన్నపాటి వార్ స్టార్ట్ చేశారు.
ఈ గొడవకు కారణం ఏంటంటే.. కన్నడలో టాప్ హీరోలుగా ఉన్నది మొన్నటి వరకూ పునీత్ రాజ్ కుమార్.. దర్శన్, సుదీప్.. వీరికంటే కాస్త ముందు తరంగా చెప్పుకున్నది మెగాస్టార్ శివరాజ్ కుమార్ మిక్స్ డ్ ఇమేజ్ తో ఉపేంద్ర కూడా ఫర్వాలేదనిపించుకున్నాడు. బట్.. పునీత్ ఇప్పుడు లేడు కాబట్టి.. టాప్ ప్లేస్ లో దర్శన్, సుదీప్ లే ఉంటారు. వీరిలో దర్శన్ కు అక్కడ బాక్సాఫీస్ సుల్తాన్ అనే బిరుదు ఉంది. మన పవన్ కళ్యాణ్ లాగా అక్కడ అతనూ ఎక్కువ రీమేక్ లు చేశాడు. తన ఇమేజ్ వల్ల ఫ్లాప్ సినిమాకు కూడా నిర్మాతలు నష్టపోవడం అరుదు. కాబట్టి ఆ ట్యాగ్ అతనికి కరెక్టే. ఇదు సుదీప్ బాలయ్య టైప్. పోతే పోయినట్టే.. లేదంటే బ్లాక్ బస్టర్. ఇలాంటి వీరిని కాదని.. ఇప్పుడుబాక్సాఫీస్ సుల్తాన్ అనే ట్యాగ్ ను యశ్ పెట్టుకున్నాడు.. లేదా ఫ్యాన్స్ తగిలించారు. దీంతో అవతలి హీరోల అభిమానులు యశ్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు కర్ణాటకలో.

ఫ్లూక్ లో వచ్చిన విజయానికి ఇంత విర్రవీగడం అవసరమా.. ఇప్పుడు ఒక్క సినిమాతోనే ఇంత బిల్డప్ ఇస్తే.. ఏళ్ల తరబడి శాండల్ వుడ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తోన్న హీరోలు ఇంకెంత విర్రవీగాలి..? ఇదంతా వారి గొప్పదనం.. యశ్ ది గప్పాలు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరి ఈ బాక్సాఫీస్ సుల్తాన్ అనే మాట విషయంలో యశ్ రియాక్ట్ అవుతాడా లేదా అనే దానిపైనే అతనికి నిజంగా కొమ్ములు వచ్చాయా లేక అభిమానుల ఓవరాక్షనా అనేది తేలుతుంది. ఏదేమైనా ఈ మాట వల్ల రాబోయే రోజుల్లో యశ్ సినిమాలకు ఇతర హీరోల అభిమానుల నుంచి ట్రోలింగ్స్ మాత్రం తప్పవు.

Telugu 70mm

Recent Posts

‘ప్రతినిధి 2‘ సినిమా రివ్యూ

నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, ఉదయ భాను, తనికెళ్ల…

47 mins ago

ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిన ‘మాయా వన్’ టీజర్

సందీప్ కిషన్ హిట్ మూవీస్ లిస్ట్ లో 'ప్రాజెక్ట్ జెడ్' ఒకటి. తమిళంలో సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన 'మాయవన్' సినిమాకి…

4 hours ago

ఆస్కార్ విజేతల రచన, స్వరకల్పనలో ‘రాయన్’ సాంగ్

విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో చిత్రం 'రాయన్'. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ…

4 hours ago

‘ఫలక్‌నుమ దాస్’ డేట్ కే రానున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల 'గామి'తో డీసెంట్…

5 hours ago

‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ 'దేవర'. అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న 'దేవర' ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది…

5 hours ago